వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..

V6 Velugu Posted on Jul 30, 2021

కొండాపూర్, వెలుగు: మల్కాపూర్ శివారులో ఈనెల 26న జరిగిన హత్య కేసును పోలీసులు 48 గంటల్లో ఛేదించారు. భార్య అక్రమ సంబంధమే భర్త హత్యకు కారణమైందని పేర్కొన్నారు. ఈ కేసు వివరాలను డీఎస్పీ బాలాజీ గురువారం వెల్లడించారు.

మల్కాపూర్ గ్రామానికి చెందిన రామలింగం 14 ఏళ్ల కింద కల్పగూర్​ గ్రామానికి చెందిన అనితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అనితకు వరసకు బావ అయిన భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో అక్రమ సంబంధం ఉన్న విషయం తెలుసుకున్న రామలింగం తరుచూ ఆమెతో గొడవ పడేవాడు. గొడవ పడుతున్న భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన అనిత అతడిని హత్య చేసేందుకు భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి ప్లాన్ చేసింది. ఈనెల 25న రాత్రి భాస్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  మందు తాగుదామని చెప్పి రామలింగంను ఆటోలో మల్కాపూర్ శివారు సమీపం శేషాద్రి వెంచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లాడు. ప్లాన్​ ప్రకారం రామలింగంకు ఎక్కువగా మందు తాగించాడు. మైకంలో ఉన్న ఆయన తలపై రాయితో కొట్టాడు. దీంతో రామలింగం అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన కొండాపూర్​ పోలీసులు 48 గంటల్లో కేసు ఛేదించి నింధితులను పట్టుకున్నారు. కేసు ఇన్వెస్టిగేషన్​ చేసిన సీఐ లక్ష్మారెడ్డి, ఎస్సై  సంతోష్​కుమార్​, కానిస్టేబుల్ రామకృష్ణ, శ్రీలతను డీఎస్పీ అభినందించారు.

Tagged Telangana, HUSBAND, wife and husband, wife killed, extra marital affair, medak dist

Latest Videos

Subscribe Now

More News