డీకే అరుణ ముందుకు కొత్త డిమాండ్.. పోటీ చేసే స్థానంపై అయోమయం

డీకే అరుణ ముందుకు కొత్త డిమాండ్.. పోటీ చేసే స్థానంపై అయోమయం

పాలమూరు జిల్లా రాజకీయాల్లో డీకే అరుణను జేజమ్మగా అభిమానులు పిలుచుకుంటారు. ఇప్పుడు డీకే అరుణ ముందుకు కొత్త డిమాండ్ వచ్చిందట. పుట్టినిల్లైన నారాయణపేట నియోజకవర్గం నుంచి అరుణను పోటీ చేయాలని లోకల్ లీడర్లు పట్టుబడుతున్నారట. BRSపై ప్రతీకారం తీర్చుకోవాలంటే డీకే అరుణనే సరైన అభ్యర్థి అని స్థానిక లీడర్లు అనుకుంటున్నారట. బీజేపీ లీడర్లు కూడా డీకే అరుణకు రిక్వెస్ట్ చేస్తున్నారట. నారాయణపేట నుంచే పోటీ చేయాలని కోరుతున్నారట. కాంగ్రెస్ లోకల్ లీడర్లు సైతం డీకే అరుణను పార్టీలోకి రావాలని, కాంగ్రెస్ తరపున నారాయణపేట బరిలో ఉండాలని అడుగుతున్నారట. 

డీకే అరుణకు మెట్టినిల్లైన గద్వాలను కాదని నారాయణపేట నుంచి పోటీ చేయటం ఇష్టం లేదట. నారాయణపేటలో పోటీ చేస్తే డీకే అరుణకు చాలా అడ్వాంటేజేస్ ఉన్నాయని చెప్తున్నారట. నారాయణపేట జిల్లా ధన్వాడ డీకే అరుణ పుట్టినిల్లు. డీకే అరుణ తండ్రి చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ మాజీ ఎమ్మెల్యే. నియోజకవర్గంలో చిట్టెం ఫ్యామిలీకి భారీగా అనుచర వర్గం ఉందట. దీనికితోడు నారాయణపేట నియోజవర్గంలో సంస్థాగతంగా బీజేపీ బలంగా ఉందట. ఇన్ని సానుకూలాంశాలున్న నారాయణపేట నుంచే బరిలో ఉండాలని పార్టీ నేతలతో పాటు స్థానికులు కోరుతున్నారట. కాంగ్రెస్, బీజేపీ నుంచి తనకు గట్టిపోటీనిచ్చే లీడర్లు లేరని బీఆర్ఎస్ అభ్యర్థి ధీమాగా ఉన్నారట. కారు స్పీడుకు బ్రేకులు వేయాలంటే డీకే అరుణతోనే సాధ్యమని లోకల్ లీడర్లు లెక్కలేస్తున్నారట. 


ALSO READ: పరకాల ఎమ్మెల్యేకు కొత్త టెన్షన్.. గ్రామాల్లో ధర్మారెడ్డికి నిరసనల వెల్లువ    

డీకే అరుణ పోటీ ఎక్కడి నుంచి ఉంటుందన్న అంశంపై క్లారిటీ లేదని పాలమూరు పొలిటికల్ సర్కిల్ లో డిస్కస్ జరుగుతోందట. పుట్టినింటి నుంచేనని నారాయణపేట లోకల్ లీడర్లు ..లేదు లేదు మెట్టినింటి నుంచేనని గద్వాల లీడర్లు చెప్తున్నారట. నారాయణ పేట లీడర్లైతే డీకే అరుణ రాక కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారట.