వాహనదారులు మీరు పెండింగ్ చలాన్లు చెల్లించారా? లేకపోతే వెంటనే చెల్లించండి. ప్రభుత్వం ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ ఇవాళ్టితో ముగుస్తుంది. కాబట్టి ఎవరైనా పెండింగ్ చలాన్లు ఉంటే వెంటనే చెల్లించాలని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. మళ్లీ డేట్ పొడిగించే అవకాశం లేకపోవచ్చని చెబుతున్నారు. ఎందుకంటే..ఇప్పటికే డిస్కౌంట్ ఆఫర్ డేట్ ను ఒకసారి పొడిగించారు. మళ్లీ గడువు పెంచకపోవచ్చని తెలుస్తోంది.
పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు 2023 డిసెంబర్ 27న ప్రభుత్వం డిస్కౌంట్ ఆఫర్ ఇచ్చింది. టూవీలర్స్, త్రీ వీలర్స్ వాహనాలపై 80 పర్సంట్.. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ కు 50 శాతం ఆఫర్ ,ఆర్టీసీ బస్సులకు 90 శాతం డిస్కౌంట్ తో చలాన్లు చెల్లించేందుకు అవకాశం ఇచ్చింది. జనవరి 10 వరకు ఈ ఆఫర్ ను ఇచ్చింది. తర్వాత మళ్లీ జనవరి 31 వరకు గడువు పొడిగించింది. దీంతో ఇవాళ్టితో ముగుస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా3.59 కోట్ల పెండింగ్ చలాన్లు ఉండగా..ఇప్పటి వరకు 40 శాతం చెల్లించినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ప్రభుత్వానికి 135 కోట్లకు పైగా ఆదాయం వచ్చిందని సమాచారం.
