ఖైదీలు ఓటు వేస్తారా..?

ఖైదీలు ఓటు వేస్తారా..?
  • దేశంలో 4 లక్షల మంది ఖైదీలు

ఇండియాలోని 130 కోట్ల జనాభాలో 90కోట్ల మంది ఓట్ల పండుగలో పాల్గొ నేందుకు సిద్ధమయ్యారు. కానీ ఓ నాలుగు లక్షల మంది మాత్రం తాము ఓటేస్తమో లేదో తెలియని సందిగ్ధంలోఉన్నారు. వీళ్లే ఖైదీలు. ఖైదీలకు ఓటు హక్కుపై ఉత్తర ప్రదేశ్‌ కు చెందిన ముగ్గురు లా స్టూ డెంట్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేయగా, స్పందిం చాలని ఎన్నికల కమిషన్‌ (ఈసీ)ను కోర్టు ఆదేశించింది. జైళ్లలో ఉన్న వారు ఓటేయకుం డా బ్యాన్‌ చేయడం రాజ్యాం గ ఉల్లంఘన కిందికే వస్తుందని, ఇది సమానత్వాన్ని కాలరాయడమేనని పిటిషనర్లు వాదిస్తున్నారు. ఓటేసే హక్కు భావ వ్యక్తీకరణ స్వే చ్ఛలో భాగమని, ఇది ప్రజాస్వామ్యానికి మూలమని పేర్కొన్నారు.

రకరకాల అభిప్రాయాలు…..

చిన్నదైనా, పెద్దదైనా నేరం నేరమే. కాబట్టి హత్యలు,లైంగిక దాడులు చేసిన వారితోపాటు చిన్న చిన్న నేరాలు చేసిన వారికీ ఓటు హక్కు తొలగిం చారు.కానీ జైల్లో ఉన్న వ్యక్తి పౌరసత్వం రద్దవదు. మరి వాళ్లకు ఓటిం గ్‌ హక్కు ఎందుకు తీసేయాలి? ఇలాం టి తేడాల వల్ల సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారిపై ప్రభావం ఉంటుం దని నిపుణులు అంటున్నారు. నేరారోపణలు ఎదుర్కొం టున్నవారు ఎన్నికల్లో పోటీ చేయొచ్చు కానీ ఓటేయలేకపోవడం విచిత్ర మంటున్నారు. దీన్ని బట్టి జైళ్లలో ఉన్నోళ్ల నేరం రుజువు కాకున్నా తక్కువ స్థాయి సిటిజన్లు అవుతున్నారని చెబుతున్నారు.

దేశంలో ఖైదీలు తక్కువే….

మన దేశంలో జైళ్లలో ఉన్న వారు చాలా తక్కువ. ఇండియాలో ప్రతి లక్ష మందికి 33 మంది జైళ్లలో ఉంటే అమెరికాలో 666 మంది ఉన్నారు. వీళ్లలో మూడిం ట రెండొంతుల మంది విచారణ ఎదుర్కొంటున్నవారే. మొత్తం ఖైదీల్లో 43 శాతం మంది ఆర్నెల్లుగా, 25 శాతం మంది ఏడాదిగా జైళ్లలో ఉన్నారు. వీరిలో 53 శాతం వరకు అట్టడుగు వర్గాల వారే.మరోవైపు దేశంలో జైళ్లు 114 శాతం కెపాసిటీతో నడుస్తున్నాయి.

తొలుత ఫ్లోరిడాలో….

లైంగికదాడి, హత్యారోపణలు ఎదుర్కొం టున్నవారికి తప్ప జైళ్లలో ఉంటున్న మిగిలిన వారికిఓటు హక్కు ఇచ్చేం దుకు 2018 నవంబర్‌‌‌‌‌‌‌‌లోయూఎస్‌‌‌‌‌‌‌‌లోని ఫ్లోరిడాలో మిడ్‌‌‌‌‌‌‌‌ టర్మ్‌‌‌‌‌‌‌‌ ఎన్ని కల్లోప్రజలు మద్దతు తెలిపారు. దీంతో సుమారు 10 లక్షల మందికి ఓటు హక్కు వచ్చిం ది. ఫ్లోరిడాను చూసి మిగిలిన దేశాలు తమ ఖైదీలకు ఓటుహక్కుపై మెల్లిమెల్లిగా మార్పు లు చేస్తున్నాయి.యూరప్‌‌‌‌‌‌‌‌లో స్వి ట్జర్లాండ్ ‌‌‌‌‌‌‌, ఫిన్లాండ్‌‌‌‌‌‌‌, నార్వే , డెన్మా ర్క్‌‌‌‌‌‌‌‌, ఐర్లాండ్ ‌‌‌‌‌‌‌, బాల్టిక్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రా లు, స్పెయిన్‌ ఇప్పటికే ఓటు హక్కిచ్చాయి. రొమానియా, ఐస్‌‌‌‌‌‌‌లాండ్‌‌‌‌‌‌‌‌, నెదర్లాండ్స్‌‌‌‌‌‌‌, స్లోవేకియా, లగ్జెం బర్గ్‌‌‌‌‌‌‌‌, జర్మనీ లాంటి దేశాలు మధ్యే మార్గాన్ని ఎంచుకున్నాయి. జైలు శిక్ష కాలం ఆధారంగా ఓటు హక్కు ఇస్తున్నాయి. బల్గేరియా పదేళ్ల కన్నాతక్కువ కాలం జైలు శిక్ష పడిన వారినే ఓటర్లుగా చూస్తోంది. ఆస్ట్రేలియాలో ఇది ఐదేళ్లుగా ఉంది. ఇలా నేరస్థుల న్యాయ సంస్కరణలను ప్రపంచ వ్యాప్తంగా మెల్లిగా మొదలవుతున్నాయి. మన ఇండియాలోనూ ఇలాంటి సంస్కరణలు వస్తే ఓటర్లు పెరిగి నేతల తలరాతలు మారిపోయే అవకాశం ఉంది.