నవంబర్ 2 శ్రీలంకతో ఇండియా ఢీ

నవంబర్ 2  శ్రీలంకతో ఇండియా ఢీ
  • ఏడో విజయంపై కన్నేసిన టీమిండియా
  • ఈ పోరుకూ పాండ్యా దూరం
  • మ. 2 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌, హాట్‌‌‌‌స్టార్‌‌‌‌లో లైవ్‌‌‌‌

ముంబై: ఇప్పటి వరకు బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌‌‌‌లో గెలిచిన ఇండియా.. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో మరో పోరుకు రెడీ అయ్యింది. గురువారం వాంఖడేలో జరిగే లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో టీమిండియా.. శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే స్టేడియంలో లంకను జయించి రెండోసారి వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ నెగ్గిన ఇండియా ఈ మ్యాచ్‌‌‌‌లోనూ గెలిచి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌తో పాటు సెమీస్‌‌‌‌ బెర్త్‌‌‌‌ను మరింత సుస్థిరం చేసుకోవాలని టార్గెట్‌‌‌‌గా పెట్టుకుంది. ఆట, ప్లేయర్లు, రికార్డుల పరంగా చూస్తే ఈ మ్యాచ్‌‌‌‌లో ఇండియానే ఫేవరెట్‌‌‌‌. ఆసీస్‌‌‌‌పై 2/3 స్కోరుతో కష్టాల్లో పడినా, ఇంగ్లండ్‌‌‌‌పై 229/9 స్కోరు చేసినా ఫుల్‌‌‌‌ కాన్ఫిడెన్స్‌‌‌‌తో ఆ  రెండు మ్యాచ్‌‌‌‌లు గెలిచింది. 

అంటే బ్యాటింగ్‌‌‌‌, బౌలింగ్‌‌‌‌ పరంగా ఇండియాకు ఎలాంటి ఇబ్బందుల్లేవని తెలుస్తోంది. ఓపెనింగ్‌‌‌‌లో రోహిత్‌‌‌‌, గిల్‌‌‌‌తో పాటు కోహ్లీ, రాహుల్‌‌‌‌, సూర్య సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్నారు. వీళ్లు నిలబడితే ఈజీగా 300 స్కోరును అంచనా వేయొచ్చు. ఇక మిడిలార్డర్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ షార్ట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ బలహీనతను అధిగమిస్తే అతన్ని ఆపడం కూడా కష్టమే. గాయం కారణంగా గత మ్యాచ్‌‌‌‌లకు దూరమైన ఆల్‌‌‌‌రౌండర్‌‌‌‌ హార్దిక్‌‌‌‌ పాండ్యా ఈ పోరులో బరిలోకి దిగడం లేదు.  అయితే హార్దిక్‌‌‌‌ లేకపోయినా పేసర్‌‌‌‌ షమీ రాకతో టీమ్‌‌‌‌ బ్యాలెన్స్‌‌‌‌ పర్ఫెక్ట్‌‌‌‌గా ఉంది. ఆడిన రెండు మ్యాచ్‌‌‌‌ల్లోనే 9 వికెట్లు తీసిన షమీ నుంచి లంకేయులకు పెద్ద ముప్పు పొంచి ఉంది. బుమ్రా, సిరాజ్‌‌‌‌ కూడా లయ అందుకుంటే ఇండియాకు తిరుగులేదు. 

స్పిన్నర్లు జడేజా, కుల్దీప్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉండటం కలిసొచ్చే అంశం. మరోవైపు ఆరు మ్యాచ్‌‌‌‌ల్లో రెండే గెలిచిన లంకకు ఈ మ్యాచ్‌‌‌‌ చావో రేవో. గాయాల వల్ల కీలక ఆటగాళ్లు దూరం అవడం అతి పెద్ద లోటుగా కనిపిస్తున్నది. అయితే సమరవిక్రమ, నిశాంక, కుశాల్‌‌‌‌ మెండిస్‌‌‌‌ మెరిస్తే ఇండియాకు కనీసం పోటీ ఇవ్వొచ్చు. మాథ్యూస్‌‌‌‌ రాకతో బ్యాటింగ్‌‌‌‌ బలం పెరిగింది. అయితే వీరందరూ భారీ ఇన్నింగ్స్‌‌‌‌పై దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఉంది. బౌలింగ్‌‌‌‌లో అనుభవజ్ఞులు లేకపోయినా కుర్రాళ్లు ఉన్నంతలో మెరుగ్గానే ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌‌‌‌లో ఇండియాను నిలువరించాలంటే లంకేయులు శక్తికి మించి శ్రమించాలి.