V6 News

వరల్డ్ టీటీలో ఇండియా శుభారంభం

వరల్డ్ టీటీలో ఇండియా శుభారంభం

లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌: వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఇండియా  మెన్స్ టీమ్ ఘన విజయంతో ప్రారంభించింది. మంగళవారం జరిగిన గ్రూప్–-7 తొలి పోరులో ఇండియా 3–-0తో ట్యునీసియాను చిత్తు చేసింది. మనుష్ షా, మానవ్ థక్కర్, హర్మీత్ దేశాయ్ తమ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించారు. 

మనుష్  3–-1తో ఎస్సిద్ వసీంపై నెగ్గగా.. మానవ్  3–-0తో యూసఫ్ ఐడ్లీని, హర్మీత్  3–-0తో అబూబాకర్ బౌరాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఓడించి ఇండియా‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తిరుగులేని విజయాన్ని అందించారు. మరోవైపు,  అమ్మాయిల టీమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అదృష్టం కలిసొచ్చింది.  ఉగాండాతో జరగాల్సిన తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రత్యర్థి జట్టు హాజరుకాకపోవడంతో ఇండియాకు 3–-0తో వాకోవర్ లభించింది.