ఉద్యోగులందరికీ ఏఐ ట్రెయినింగ్ : విప్రో ప్రకటన

ఉద్యోగులందరికీ ఏఐ ట్రెయినింగ్ : విప్రో ప్రకటన

బెంగళూరు: కంపెనీలో పనిచేస్తున్న 2.50 లక్షల మంది ఉద్యోగులకు ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​లో ట్రెయినింగ్​ ఇవ్వనున్నట్లు విప్రో బుధవారం ప్రకటించింది. ఈ ట్రెయినింగ్​ కోసం బిలియన్​ డాలర్లు (రూ.8,200 కోట్లు) ఖర్చు పెట్టనున్నట్లు వెల్లడించింది. రాబోయే మూడేళ్లలో ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు తెలిపింది. క్లౌడ్​, డేటా ఎనలిటిక్స్​, కన్సల్టింగ్​ అండ్​ ఇంజినీరింగ్​ టీములలోని 30 వేల మంది ఉద్యోగులను ఒక గొడుగు కిందకి తేనున్నట్లు కూడా విప్రో ప్రకటించింది. ట్రిలియన్​ల కొద్దీ డాలర్ల విలువను ఎకానమీకి జోడించే సామర్ధ్యం ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​కు ఉందని వివరించింది. ఉద్యోగుల కోసం ఏఐ కరిక్యులమ్​ రూపొందించనున్నట్లు పేర్కొంది. జెన్​ఏఐ సీడ్​ యాక్సిలేటర్​ ప్రోగ్రామ్​ కూడా తేనున్నట్లు వెల్లడించింది. విప్రో ఏఐ360 పేరుతో ఎకో సిస్టమ్​ డెవలప్​ చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఆర్టిఫిషియల్​ ఇంటెలిజెన్స్​ దూసుకెళ్తోందని విప్రో మేనేజింగ్​ డైరెక్టర్​ థీరీ డెలాపోర్ట్​ ఈ సందర్భంగా చెప్పారు.