వైట్ హౌస్ లోకి మళ్లీ రెండు ఫస్ట్ డాగ్స్

వైట్ హౌస్ లోకి మళ్లీ రెండు ఫస్ట్ డాగ్స్

అమెరికా ప్రెసిడెంట్ అధికారిక నివాసం వైట్ హౌస్ లోకి మళ్లీ రెండు ‘ఫస్ట్ డాగ్స్’ రానున్నాయి. ప్రెసిడెంట్ ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్,ఆయన భార్య జిల్ బైడెన్ లు పెంచుకుంటున్నచాంప్ (12), మేజర్ (2) అనే జర్మన్ షెపర్డ్ డాగ్స్ వారితో పాటే వైట్ హౌస్ లోకి అడుగుపెట్టనున్నాయి. వీటికోసం సోమవారం ప్రత్యేకంగా ‘ఫస్ట్ డాగ్స్ యూఎస్ఏ’ పేరుతో ఒక ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ను కూడా డెడికేట్ చేసి, ఇందులో వాటి ఫొటోలు పెట్టారు. అమెరికా ప్రెసిడెంట్ ను పొటస్ (ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్స్టేట్స్) అని, ఫస్ట్ లేడీని ఫ్లొటస్ (ఫస్ట్ లేడీ ఆఫ్ది యునైటెడ్ స్టేట్స్) అనీ అంటరు. అట్లనే.. ప్రెసిడెంట్ పెట్ డాగ్ నూ అమెరికాలో ఫస్ట్ డాగ్గా, డోటస్ (డాగ్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్)గా పిలుస్తరు. ట్రంప్, ఆయన భార్య మెలానియా వద్ద పెట్ డాగ్స్ లేకపోవడంతో గత నాలుగేళ్లు గా వైట్ హౌస్ లో ‘డోటస్’లు లేకపోయాయి. బైడెన్ ప్రెసిడెంట్ పగ్గాలు చేపడితే.. అమెరికాకు రెండు డోటస్ లు రానున్నాయి. వైట్ హౌస్లో చివరిసారిగా 2016లో రెండు డోటస్ లు సందడి చేశాయి. అప్పటి ప్రెసిడెంట్ ఒబామా..
బో, సన్నీ అనే రెండు పోర్చు గీస్ వాటర్ డాగ్స్ ను పెంచుకున్నారు.