
న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్‌లో పరిస్థితు లు చక్కబడ్డాక, అక్కడి టెర్రరిస్టులు పాకిస్థాన్ ప్రభుత్వం, ఐఎస్‌ఐ సాయంతో జమ్మూకాశ్మీర్లోకి చొరబడేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణె చెప్పారు. అయితే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని తెలిపారు. శనివారం ఇండియా టుడే కాన్ క్లేవ్లో ఆయన మాట్లాడారు. ‘‘జమ్మూకాశ్మీర్‌లో టెర్రరిస్టుల యాక్టివిటీలు పెరిగాయి. అయితే వాటితో అఫ్గాన్‌కు సంబంధం ఉందో? లేదో? చెప్పలేం. ఇంతకుముందు అఫ్గాన్‌ను తాలిబాన్లు పాలించిన టైమ్‌లో ఆ దేశానికి చెందిన టెర్రరిస్టులు జమ్మూకాశ్మీర్లోకి చొరబడ్డారు. ఇప్పుడూ అది రిపీట్ అయ్యేందుకు అవకాశం ఉంది” అని చెప్పారు.