
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 63,371 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 73,70,469కి చేరాయి. నిన్న 895 మంది చనిపోవడంతో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య మొత్తం 1,12,161 కు చేరింది. నిన్న ఒక్కరోజే 81541 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నిన్నటి వరకు 64,53,780 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 8,04,528 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఒక్కరోజే 10,28,622 కరోనా టెస్టులు చేయగా.. మొత్తం కరోనా టెస్టుల సంఖ్య 9,22,54,927కు చేరింది.
For More News..