ఉద్యమ నేత శ్యామప్రసాద్ కల నిజమైంది..

ఉద్యమ నేత శ్యామప్రసాద్ కల నిజమైంది..

న్యూఢిల్లీ: ‘‘ఏక్ దేశ్ మే దో విధాన్, దో ప్రధాన్, దో నిశాన్ నహీ చెలేంగే (ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు , రెండు జెండాలు చెల్లవు)” అంటూ నినదించిన నాయకుడు శ్యామ ప్రసాద్ ముఖర్జీ. ఆర్టికల్​ 370 రద్దుతో ఆయన కల సాకారమైందని బీజేపీ నేతలు అంటున్నారు. 1901 జులై 6న కోల్​కతాలో జన్మించిన శ్యామ ప్రసాద్ .. తుది శ్వాస వరకకూ ఆర్టికల్​370కి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆ పోరాటంలోనే ప్రాణాలు విడిచారు. నెహ్రూ కేబినెట్లో  మంత్రిగా కొనసాగుతూనే జమ్మూ కాశ్మీర్​ విషయంలో నెహ్రూ విధానాలను తీవ్రంగా తప్పుబట్టేవారు. ఇండియాలో జమ్మూకాశ్మీర్​ అంతర్భాగమేనని, దానికి స్వయం ప్రతిపత్తి కల్పచడం వల్ల అక్కడి ప్రజలకు దేశంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితి
వచ్చిందని ఆందోళన వ్యక్తం చేసేవారు. జుమ్మూకాశ్మీర్​లో గవర్నర్​ బదులు ‘సర్దార్ – ఏ- రియాసత్’ ,ముఖ్యమంత్రి స్థానంలో ప్రధాని ఉండటమేమిటని ఆయన ఉద్యమించారు. ఇదే నినాదంతో ఊరూరాతి రిగారు. లా చదివిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ 33ఏండ్ల వయసులోనే కలకత్తా యూనివర్సిటీ వైస్ చాన్సలర్​ అయ్యారు. నెహ్రూ తొలి కేబినెట్ లో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. నెహ్రూ, నేషనల్​ కాన్ఫరెన్స్​ పార్టీ ఫౌండర్​ షేక్ అబ్దుల్లా తీసుకున్నతప్పుడు నిర్ణయం వల్లే ఆర్టికల్​ 370 వచ్చిందని, ఈ ఆర్టికల్​ వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల వారెవరూ ఆ రాష్ట్రంలోకి వెళ్లడానికి వీలు లేకుండాపోయిందని ఆయన ఉద్యమాలు చేపట్టారు. 370 ఆర్టికల్​ను రద్దు చేయాలని, పాక్ ఆక్రమించుకున్న కాశ్మీర్​ను కూడా
ఇండియాలో కలుపుకోవాలని డిమాండ్ చేసేవారు.నెహ్రూ విధానాలను నిరసిస్తూ 1950లో కేంద్రమంత్రి పదవికి ఆయన రాజీనామా చేసి హిందూ
మహాసభలో చేరారు. అటు తర్వాత 1951 అక్టోబర్ 22న భారతీయ జనసంఘ్ పార్టీని స్థాపించారు. కాలక్రమంలో అది భారతీయ జనతా పార్టీగా మారింది.