ప్రజల ఆశీర్వాదం ఉంటేనే రాజకీయ నాయకునికి బతకు

V6 Velugu Posted on Jun 16, 2021

మేడ్చల్ జిల్లా: తెలంగాణలో మరో ఉద్యమం ఆత్మగౌరవం కోసం మొదలైందన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్. బుధవారం ఆయన మేడ్చల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డి, బీజేపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల..  నా ఇల్లు మేడ్చల్ లోనే ఉందని.. మీ కళ్ళలో మెదిలిన బిడ్డను ఆశీర్వదించాలన్నారు. మీకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటానని.. సుష్మాస్వరాజ్, విద్యాసాగర్ రావుతో కలిసి అనేక మీటింగ్స్ లో తెలంగాణ కోసం పాల్గొన్నానన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రజలు అసహ్యించుకుంటున్నారని.. తెలంగాణలో మరో ఉద్యమం ఆత్మగౌరవం కోసం మొదలైందన్నారు. ప్రజల ఆశీర్వాదం ఉంటేనే రాజకీయ నాయకునికి బతకు అని.. హుజురాబాద్ ఎన్నిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. మీ అందరి అండకు ధన్యవాదాలని.. నేను నిప్పులాగా పెరిగిన బిడ్డను అన్నారు. 

భూమి గుంజుకున్న లోంగిపోలేదు  కానీ.. ఇప్పుడు చట్టం కొంత మందికే పని చేస్తుందన్నారు. ఈ ప్రభుత్వం కొనసాగితే తెలంగాణ ప్రజలకు అరిష్టమని.. ఈ ప్రభుత్వాన్ని దించే వరకు నిద్రపోవద్దన్నారు. సమాజమంతా అనుకుంటుందని..కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలన్నారు. అహంకారానికి ఘోరీ కట్టాలని.. 2024లో తెలంగాణలో ఎగిరేది కాషాయం జెండా అన్నారు.  మేడ్చల్ అర్బన్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పన్నాల హరిచంద్ర రెడ్డి మాట్లాడుతు.. నయానిజాం పాలన నుండి తెలంగాణ విముక్తి చేయడమే మనందరి లక్ష్యం అన్నారు. ఈటల రాజేందర్ వెంట మేమంతా ఉంటామని భరోసా ఇచ్చారు. హుజూరాబాద్ లో గడప గడపకు వెళ్లి ప్రచారం చేస్తామన్నారు.

Tagged Bjp, etela rajender, CM KCR, election, Huzurabad,

Latest Videos

Subscribe Now

More News