మిర్చి రైతు కడుపు మండింది

మిర్చి రైతు కడుపు మండింది
  • జెండా పాట 17,200 అని.. మూడు వేలు తగ్గించడంతో ఆందోళన
  • వరంగల్ ​మార్కెట్​ ఎదుట ధర్నా చేసిన రైతులు  
  • చర్చలంటూ పిలిచి మళ్లీ అదే పని 
  • ఆగ్రహంతో పూల కుండీలు, కాంటాలు, డీసీఎం అద్దాలు ధ్వంసం 
  • అట్టుడికిన వరంగల్‍ ఏనుమాముల మార్కెట్‍
  • ఆర్డీఓ హామీతో నిరసన విరమణ

ఒక రేటు చెప్పి మరో రేటు ఇస్తామనడంతో మిర్చి రైతులు ఆందోళనకు దిగారు. వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​కు సోమవారం తెల్లవారేసరికే 15 వేల నుంచి 20 వేల మిర్చి బస్తాలు వచ్చాయి. రైతుల సమక్షంలో వ్యాపారులు, ఆఫీసర్లు 'తేజ' రకం మిర్చి క్వింటాకు రూ.17,200 మార్కెట్​ జెండా పాట ధరగా నిర్ణయించారు.  మంచి రేటు ఇచ్చామంటూ అక్కడున్నవారితో చప్పట్లు కొట్టించారు. కొద్దిసేపటికే రేటును రూ.14 వేలకు డౌన్‍ చేశారు. దీనిపై రైతులు ఫైరయ్యారు. 17,200 రేటును పది మందికే ఇచ్చి.. మిగిలిన వారికి తగ్గించడమేంటని వ్యాపారులను ప్రశ్నించారు. సమాధానం చెప్పకపోవడంతో మార్కెట్‍ మెయిన్‍ గేట్‍ బయటకొచ్చి ధర్నా చేపట్టారు.

వరంగల్‍/వరంగల్‍ సిటీ, వెలుగు: వరంగల్‍ ఎనుమాముల మార్కెట్​లో మిర్చి రైతులు సోమవారం కన్నెర్ర చేశారు.  రికార్డు స్థాయిలో ధరలు ప్రకటించామంటూనే.. నిమిషాల వ్యవధిలో రేటు తగ్గించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం కోసం రోడ్డెక్కారు. మాట్లాడుకుందామన్న పోలీసులు, ఆఫీసర్ల సూచనతో అక్కడి నుంచి ర్యాలీగా మార్కెట్​లోకి వచ్చారు. తీరా.. ఖరీదుదారులు చెప్పిన ధరకు...కొంటున్న ధరకు తేడా ఉండడంతో తట్టుకోలేకపోయారు. మెయిన్‍ ఆఫీస్‍లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు అడ్డుకోగా అక్కడున్న పూల కుండీలను ధ్వంసం చేశారు. వ్యాపారులు ఓ వైపు చర్చలంటూనే మరోవైపు కాంటాలు పెట్టడంతో మరోసారి సీరియస్‍ అయ్యారు. కొనుగోలు సెంటర్‍ వద్దకొచ్చి కాంటాలను విసిరేశారు. డీసీఎం ఎక్కించిన బస్తాలను కిందపడేశారు. తమ మాట కాదని లోడ్‍తో వెళుతున్న వెహికిల్స్​అద్దాలు  పగలగొట్టారు. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు మార్కెట్​లో టెన్షన్‍ వాతావరణం నెలకొంది.

రూ.17,200 అని నిమిషాల్లోనే తగ్గించిన్రు

వరంగల్​ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్​కు శని, ఆదివారాల తర్వాత వర్కింగ్‍ డే కావడంతో..​ సోమవారం తెల్లవారేసరికే 15 వేల నుంచి 20 వేల మిర్చి బస్తాలు వచ్చాయి. రైతుల సమక్షంలో వ్యాపారులు, ఆఫీసర్లు క్వింటాల్​ 'తేజా' రకానికి రూ.17,200 మార్కెట్​ జెండా పాట ధరగా నిర్ణయించారు. మంచి రేటు ఇచ్చామంటూ అక్కడున్నవారితో చప్పట్లు కొట్టించారు. కొద్దిసేపటికే రేటును రూ.14 వేలకు డౌన్‍ చేశారు. దీంతో రైతన్నలు ఫైర్‍ అయ్యారు. 17,200 రేటును పది మందికే ఇచ్చి.. మిగిలిన వారికి తగ్గించడమేంటని వ్యాపారులను ప్రశ్నించారు. రిప్లై లేకపోవడంతో మార్కెట్‍ మెయిన్‍ గేట్‍ బయటకొచ్చి ధర్నా చేపట్టారు.  

ఐదు గంటలు రోడ్డుమీదే... 

ఉదయం 9 గంటలకు మొదలైన రైతుల నిరసన మధ్యాహ్నం రెండు గంటల వరకు కొనసాగింది. వీరికి మద్దతుగా బీజేపీ లీడర్లు నిరసనలో నిపాల్గొన్నారు. దీంతో ఏసీపీ గిరికుమార్‍, ఇంతేజార్​ గంజ్, మిల్స్​కాలనీ సీఐల ఆధ్వర్యంలో పోలీసులను మోహరించారు. ఈ క్రమంలో రైతులు, పోలీసులకు మధ్య పలుమార్లు ఘర్షణ వాతావరణం నెలకొంది. న్యాయం చేస్తామనే హామీతో చర్చలకు రాగా మార్కెట్​ చైర్​పర్సన్​ దిడ్డి భాగ్యలక్ష్మి, డీడీఎం రాజునాయక్​, సెక్రెటరీ రాహుల్​,​ చాంబర్​ ఆఫ్​ కామర్స్​ ప్రెసిండెంట్ బొమ్మినేని రవీందర్​రెడ్డి చర్చించారు. ప్రస్తుత ధరకు మరో రూ.1000 అదనంగా ఇస్తామని కాంటాలు మొదలుపెట్టారు.