రూ.2 వేల నోట్లు : వారం రోజుల్లో 17 వేల కోట్లు మార్చుకున్నారు

 రూ.2 వేల నోట్లు : వారం రోజుల్లో 17 వేల కోట్లు మార్చుకున్నారు

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కీలక ప్రకటన చేసింది. రూ.2 వేల నోట్ల ఎక్స్చేంజ్ విషయంలో ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. కేవలం వారం రోజుల వ్యవధిలో దాదాపు రూ. 17 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను కస్టమర్స్ డిపాజిట్ చేశారని వెల్లడించింది. అంటే ప్రజలు వారి వద్ద ఉన్న రూ. 17 వేల కోట్ల విలువైన రూ.2 వేల నోట్లను ఎస్‌బీఐకు బ్యాంకులకు వెళ్లి డిపాజిట్ చేశారు. బ్యాంకులు మే 23 నుంచి రూ.2 వేల నోట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నాయి. సెప్టెంబర్ 30 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016 నోట్ల రద్దు తర్వాత కొత్తగా రూ. 2 వేల నోట్లను తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పాత రూ. 500 నోట్లు, రూ.1000 నోట్ల రద్దు తర్వాత రూ. 2 వేల నోట్లు చెలామణిలోకి వచ్చాయి. ఇంకా కొత్త రూ. 500 నోట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. తాజాగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రూ. 2 వేల నోట్లను ఉపసంహరిచుకుంది.