బెంగళూరు ఎయిర్ పోర్టులో 72 పాము పిల్లలు.. ఒక్కో పాము ఒక్కో రకం

బెంగళూరు ఎయిర్ పోర్టులో 72 పాము పిల్లలు.. ఒక్కో పాము ఒక్కో రకం

బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ మహిళా ప్రయాణికురాలు తన రెండు బ్యాగుల్లో 17 కింగ్ కోబ్రాస్‌తో సహా 72 పాము పిల్లలను బెంగళూరుకు తీసుకువచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు తనిఖీ చేయగా.. అప్పటికే ఆమె బెంగళూరు విమానాశ్రయం నుంచి తప్పించుకున్నట్లు తెలిపారు. సరీసృపాలే కాకుండా, ఆరు చనిపోయిన జంతువులు-మూడు స్పైడర్ కోతులు, మూడు కాపుచిన్ కోతులు-కూడా ఒక సూట్‌కేసులో ఉన్నట్టు అధికారులు కనుగొన్నారు. ఇవన్నీ ఊపిరాడక చనిపోయాయని, 72 సరీసృపాలను ఆ తరువాత థాయ్‌లాండ్‌కు తిరిగి పంపించారని చెప్పారు.

"స్కానర్ లో సామానును పంపి చెక్ చేయగా వాటిలో నాగుపాములు, చిన్న కోతులతో సహా అనేక పాము పిల్లలు ఉండడం చూసి మేము ఆశ్చర్యపోయాము" అని బెంగళూరు కస్టమ్స్ ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్‌లోని ఒక అధికారి చెప్పారు. కస్టమ్స్ అధికారులు సరీసృపాలను తొలగించే పనిలో నిమగ్నమై ఉండగా, ఒక ప్రయాణికురాలు విమానాశ్రయం నుంచి రహస్యంగా బయటకు వెళ్లిపోయారు. విమానాశ్రయంలోని క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరా ఫుటేజీలో మహిళ వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి.

"మేము ప్రయాణీకుల మానిఫెస్ట్ నుంచి మహిళను కనుగొన్నాము. ఆమె చెన్నై విమానాశ్రయం నుంచి నాలుగు సార్లు ప్రయాణించినట్లు ప్రాథమిక విచారణలో కనుగొన్నాం, బహుశా ఇది వన్యప్రాణుల స్మగ్లింగ్ కావచ్చు" అని విచారణ అధికారి తెలిపారు.