
- హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీ మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్స్‌లో ఘటన
కూకట్పల్లి, వెలుగు: వైద్య పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ సెంటర్‌కు వెళ్లిన ఓ మహిళ డాక్టర్ ఇచ్చిన అనస్థీషియా డోస్ ఎక్కువై, మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్ ఖాజాగూడకు చెందిన ఎస్.సూర్యలక్ష్మి(66) మంగళవారం కొడుకు వెంకట అభిషేక్‌తో కలిసి కేపీహెచ్‌బీ కాలనీలోని మెడ్క్వెస్ట్ డయాగ్నోస్టిక్సెంటర్కు వెళ్లింది. రన్నీ నోస్సమస్యతో బాధ పడుతున్న ఈమె సీటీ క్యాస్టెనోగ్రఫీ చేయించుకోవాల్సి ఉంది.
ఈ టెస్ట్‌కు ముందు అక్కడి డాక్టర్ఆమెకు అనస్థీషియా ఇచ్చారు. అయితే, డోస్ఎక్కువ కావడంతో సూర్యలక్ష్మి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. సెంటర్వైద్యులు, సిబ్బంది ఈ విషయాన్ని బాధితురాలి కొడుక్కి చెప్పకుండా జాప్యం చేశారు. అనుమానం వచ్చి న కొడుకు తల్లిని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లగా మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. డయాగ్నోస్టిక్సెంటర్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్లే తన తల్లి చనిపోయిందని మృతురాలి కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు.