ఈ రోజుల్లో చిన్నచిన్న విషయాలకే మనస్తాపం చెంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యామని... ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని... భార్యపై కోపంతో.. భర్త.. భర్త ఏదో అన్నాడని భార్య బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా భార్యను బ్యూటీప్లార్లర్కు వెళ్లొద్దన్నాడని.. ఆమె ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్ చోటుచేసుకుంది. ఇండోర్ జిల్లాలో బ్యూటీ పార్లర్ కు వెళ్లేందుకు భర్త నిరాకరించడంతో 34 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు శనివారం (ఏప్రిల్ 29) తెలిపారు. ఈ సంఘటన నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం (ఏప్రిల్ 27) చోటుచేసుకుంది. ఆ మహిళను స్కీం-51లో నివాసముంటున్న రీనా యాదవ్ గా గుర్తించారు. రీనా యాదవ్ అనే మహిళకు బలరామ్ యాదవ్ తో 15 ఏళ్ల క్రితం వివాహమైందని విచారణ అధికారిఎస్సై ఉమా శంకర్ యాదవ్ తెలిపారు. గురువారం (ఏప్రిల్ 27) బ్యూటీ పార్లర్ కు వెళ్లాల్సిందిగా బలరామ్ ను అడగ్గా అతడు నిరాకరించాడు. దీంతో ఆమె మనస్థాపం చెంది బ్యూటీపార్లర్ కు వెళ్లకుండా అడ్డుకున్నాడని, ఆవేశంతో ఫ్యాన్ కు ఉరివేసుకుని చనిపోయింది. బలరామ్ ఇంటికి వచ్చినప్పుడు, ఆమె ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించి, విషయం గురించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇంత చిన్నదానికేనా తల్లీ : పార్లర్ కు వద్దన్నాడని.. ప్రాణం తీసుకున్న భార్య
- దేశం
- April 29, 2023
లేటెస్ట్
- జస్ట్ మిస్: దేశంలో మరో భారీ రైలు ప్రమాదానికి కుట్ర
- హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం..పలుప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం
- షాకింగ్ వీడియో: చూస్తుండగానే భారీ గుంతలోపడ్డ ట్రక్కు
- కేపీహెచ్బీ లేడీస్ హాస్టల్లో యువతి ఆత్మహత్య
- రైతులకు మంత్రి ఉత్తమ్ గుడ్ న్యూస్
- SLBC పనులకు రూ.4వేల 637 కోట్ల నిధులు: కేబినెట్ నిర్ణయం
- ఇకపై హైడ్రా మరింత పవర్ ఫుల్.. తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం
- ఫీజు కట్టలేదని విద్యార్థులను బంధించారు..స్కూల్ ఎదుట తల్లిదండ్రుల ఆందోళన
- మంత్రి దామోదర చొరవ..సమ్మె విరమించిన ఆరోగ్య మిత్రలు
- 40 అడుగుల లోయలో పడ్డ ఆర్మీ వెహికల్.. ముగ్గురు జవాన్లు మృతి
Most Read News
- బలహీనపడిన రుతుపవనాలు..అలర్ట్ ఉన్న జిల్లాలివే..
- అంతా చంద్రబాబు కట్టు కథ.. తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన జగన్
- Gold Rate Today: స్థిరంగా బంగారం ధరలు.. ఈరోజు ధరలు ఎంతంటే...
- telangana NEET counselling : గుడ్న్యూస్ : నీట్ కౌన్సెలింగ్లో తెలంగాణ విద్యార్థులకు ఊరట
- IND vs BAN 2024: తప్పు జరిగింది: నాటౌటైనా పెవిలియన్కు వెళ్లిన కోహ్లీ
- బిగ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో తెలంగాణలో మళ్లీ వాన
- IND vs BAN 2024: అంచనా తప్పింది: రోహిత్, సిరాజ్కు పంత్ క్షమాపణలు
- Good Health : ఏ బ్లడ్ గ్రూప్ వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి.. ?
- అవును నాకు ఆ సమస్య ఉంది: స్టార్ హీరోయిన్.
- హైడ్రా కేసును కొట్టివేయండి .. హైకోర్టులో చందానగర్ మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ పిటిషన్