యువతి ప్రాణాలు తీసిన అన్నాడీఎంకే ఫ్లెక్సీ

యువతి ప్రాణాలు తీసిన అన్నాడీఎంకే ఫ్లెక్సీ

చెన్నైలో ఘోరం జరిగింది. ఓ ఫ్లెక్సీ యువతి ప్రాణాలు తీసింది. పెళ్లి ఆహ్వానం కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ రోడ్డుపై వెళుతున్న యువతి బైక్ పై పడి కింద పడిపోయింది. అదే సమయలో  వెనుక నుంచి వస్తున్న లారీ ఆమెపై వెళ్లడంతో ఆ యువతి అక్కడే ప్రాణాలు కోల్పోయింది.

ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్  చేస్తున్న శుభ శ్రీ (23) గురువారం సాయంత్రి ఇంటికి వెళ్తుంది. రోడ్డుపై వెళ్తుండగా అన్నాడీఎంకే నేతలు పెళ్లి ఆహ్వానం కోసం ఫ్లెక్సీ ఏర్పాటు  చేశారు. ఆ ఫ్లెక్సీ నేలకొరిగింది. దానిని తప్పించే క్రమంలోశుభశ్రీ అదుపు తప్పి రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో  శుభశ్రీపై వెనుక వైపున వచ్చిన వాటర్‌ ట్యాంకర్‌ వెళ్లింది. దీంతో సంఘటన స్థలంలోనే ఆమె మృతిచెందింది. సమాచారం తెలుసుకున్న పళికరణై పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం క్రోంపేట ఆసుపత్రికి తరలించారు. ఆ బ్యానర్‌ను ఎలాంటి అనుమతి లేకుండా ఏర్పాటు చేసి ఉన్నట్టు విచారణలో తేలింది. ఈ బ్యానర్‌ వల్లే శుభశ్రీ మరణించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దీనిపై స్పందించిన డీఎంకే అధినేత స్టాలిన్ యువతి మృతిపై విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం, పోలీసుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమన్నారు.