
ఆ భర్త చాలా పేదోడు. రోజూ కూలీ చేస్తే తప్ప పొట్ట నిండని పరిస్థితి. అతడి భార్యకు కోడిగుడ్లంటే పిచ్చి. రోజూ తెచ్చిపెట్టమని అడిగేది. కానీ, ఆ స్థోమత లేని ఆ భర్త తెచ్చిపెట్టలేకపోయేవాడు. దీంతో ఆమె గొడవ పడేది. ఓ సారి గుడ్లు తెస్తావా తేవా అని గొడవ పెట్టుకుని ప్రియుడితో పరారైపోయింది. నాలుగు నెలల క్రితం మళ్లీ ఇంటికొచ్చింది. శనివారం మళ్లీ గుడ్ల గొడవ మొదలైంది. తన వల్ల కాదని భర్త నచ్చజెప్పినా.. వినలేదు. తెల్లారే సరికి ఇంట్లో లేదు. అతడి ప్రియుడి గురించి ఆరా తీస్తే.. అతడూ ఊళ్లో లేడని తెలిసింది. ఆ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా కాంపియర్గంజ్లో జరిగింది. రోజూ గుడ్లు కొనుక్కొచ్చే స్థోమత లేదని చెప్పినా తన భార్య వినిపించుకోలేదని, ఆమె బలహీనతను ఆసరాగా తీసుకునే అతడు లేవదీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు.