అప్పుడే పుట్టిన బిడ్డకు Fani పేరు

అప్పుడే పుట్టిన బిడ్డకు Fani పేరు

భువనేశ్వర్ : ప్రస్తుతం ఒడిశాను గడగడలాడిస్తోంది Fani తుపాను. ఇప్పుడు అందరి నోటా ఇదే హాట్ టాపిక్ అయ్యింది. Fani తుపానుకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ తుపాను ఎప్పటికీ గుర్తుండేలా అప్పుడే పుట్టిన బిడ్డకి Fani అని తుఫాన్ అని పేరు పెట్టారు. రైల్వే హాస్పిటల్ లో జన్మించిన ఓ పండంటి బిడ్డకు Faniగా నామకరణం చేశారు.

32 ఏళ్ల మహిళ మాంచేశ్వర్‌లోని కోచ్ రిపేర్ వర్క్‌షాప్‌లో హెల్పర్‌గా పని చేస్తోంది.  ఆ మహిళ ఇవాళ ఉదయం 11:03 గంటల సమయంలో ఆడబిడ్డకు రైల్వే హస్పిటల్ లో జన్మనిచ్చింది. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు డాక్టర్లు. అయితే ఒడిశాను అతలాకుతలం చేస్తున్న తుపాను Fani పేరునే ఆ బిడ్డకు పెట్టారు. బంగాళాఖాతంలో అలజడి సృష్టించిన Fani తుపాను ప్రచండ తుపానుగా మారి ఈ ఉదయం 11 గంటల టైమ్ లో ఒడిశాలో తీరం దాటింది.