పెళ్లానివో రాక్షసివో.. : జిమ్ ట్రైనర్ తో లవ్.. భర్తను చంపించిన భార్య,, మూడేళ్ల తర్వాత

పెళ్లానివో రాక్షసివో.. : జిమ్ ట్రైనర్ తో లవ్.. భర్తను చంపించిన భార్య,, మూడేళ్ల తర్వాత

ఆడోళ్లు ఏంటీ ఇలా ఉన్నారు అనేంతగా.. వాళ్లు చేయిస్తున్న హత్యలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మూడేళ్ల క్రితం జరిగిన ఓ మర్డర్ మిస్టరీ వీడటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది. రోజూ జిమ్ కు వెళ్లే మహిళ.. అక్కడి జిమ్ ట్రైనర్ తో ప్రేమలో పడింది.. అతన్ని పెళ్లి చేసుకోవటానికి కట్టుకున్న భర్తను చంపించింది.. మూడేళ్ల తర్వాత వీడిన ఈ మిస్టరీ ఏంటో తెలుసుకుందామా...

హర్యానా రాష్ట్రం పానిపట్ లో నివాసం ఉండే భార్యభర్తలు నిధి, వినోద్. వీళ్లకు పెళ్లయ్యి ఓ కుమార్తె ఉంది. కంప్యూటర్ ఇనిస్టిట్యూట్ నిర్వహించే వినోద్.. నిధి ఎంతో అన్యోన్యంగా ఉండే వారు. ఫిట్ నెస్ కోసం అని భార్య నిధి.. ఇంటికి దగ్గరలో ఉన్న జిమ్ లో జాయిన్ అయ్యింది. అక్కడ ట్రైనర్ గా ఉన్న సుమిత్ పరిచయం అయ్యాడు. ఆ తర్వాత నిధి, సుమిత్ బాగా క్లోజ్ అయ్యారు. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు.

జిమ్ ట్రైనర్ ను పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో ఉన్న నిధికి.. భర్త వినోద్ అడ్డుగా ఉన్నాడు. దీంతో భర్తను చంపేయాలని డిసైడ్ అయ్యింది. కాబోయే కొత్త భర్త సుమిత్ తో కలిసి ప్లాన్ వేసింది. లారీతో గుద్దించి చంపాలని ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే లారీ డ్రైవర్ సునర్ కు 10 లక్షల రూపాయల సుపారీ ఇచ్చారు. అయితే ఈ ప్లాన్ వర్కవుట్ కాలేదు. ప్లాన్ బి అమలు చేశారు. భర్త వినోద్ ను తుపాకీతో కాల్చి చంపాలని ప్లాన్ వేశారు. లారీ డ్రైవర్ సునర్ కు ఓ తుపాకీ ఇచ్చి.. వినోద్ ను హత్య చేయించారు. ప్లాన్ వర్కవుట్ అయ్యింది. భర్త వినోద్ చనిపోవటంతో.. కుమార్తెను చదువుల కోసం అని ఆస్ట్రేలియాలో ఉన్న బంధువుల దగ్గరకు పంపించింది నిధి. మూడేళ్లు హ్యాపీ జిమ్ ట్రైనర్ సుమిత్ తో జీవితాన్ని ఎంజాయ్ చేస్తుంది నిధి.

అయితే విదేశాల్లో ఉన్న హత్యకు గురైన వినోద్ తమ్ముడికి అనుమానం వచ్చింది. వదిన నిధి లైఫ్ స్టయిల్ మారిపోవటం.. లగ్జరీగా జీవించటం.. అన్నపోయాడనే బాధ లేకపోవటం వంటి కారణాలతో ఎంక్వయిరీ మొదలుపెట్టాడు. ఈ క్రమంలోనే తనకు లభించిన ఆధారాలను పానిపట్ ఎస్పీ అజిత్ సింగ్ షెకావత్ కు వాట్సాప్ ద్వారా పంపించాడు. 

రంగంలోకి దిగిన పోలీసులు.. తమ స్టయిల్ లో విచారణ మొదలుపెట్టారు. లారీ డ్రైవర్ సునర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తే అంతా కక్కేశాడు. జిమ్ ట్రైనర్ సుమిత్, వినోద్ భార్య నిధి హస్తం ఉందని చెప్పాడు. వాళ్లను పట్టుకుని విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తానికి జిమ్ ట్రైనర్ పరిచయం, ప్రేమ ఏకంగా భర్తను హత్య చేసే వరకు వెళ్లింది.. అది కూడా మూడేళ్ల తర్వాత బయటపడటం అంటే.. ఎంత పక్కా ప్లాన్ వేశారో కదా..

నిజం శవం లాంటిది అని ఊరికే అనలేదు.. ఆలస్యం అయినా బయటకు రావాల్సిందే..