ఆకలితో ఉన్నవాళ్లకు బిర్యానీ ఫ్రీ..ఎక్కడంటే.?

ఆకలితో ఉన్నవాళ్లకు బిర్యానీ ఫ్రీ..ఎక్కడంటే.?

బిర్యానీ తినాలని చాలామందికి ఉంటుంది కానీ రేటు ఎక్కువగా ఉండటంతో వెజ్ తో అడ్జస్ట్ అవుతారు. ఎక్కడైనా ప్లేట్ బిర్యానీ కావాలంటే కనీసం రూ.100కు పైనే ఉంటుంది. రోడ్  సైడ్ అమ్మే బిర్యానీకి కూడా రేటేక్కువే.. కాస్త ఖరీదైన హోటళ్లో అయితే రూ. 200 నుంచి 500 వరకు ఉంటుంది. ఈ కరోనా తర్వాత ఈ రేటు కాస్త ఎక్కువైందనే చెప్పవచ్చు. కానీ తమిళనాడులోని కోయంబత్తూర్ లో ఓ మహిళ ఆకలితో ఉన్న వాళ్లకు ఫ్రీగా బిర్యానీ పెడుతుంది. మిగతా వాళ్లకు తక్కువ ధరకు రూ. 50కి కడుపు నిండా బిర్యానీ పెడుతుంది.

కోయంబత్తూర్ లో రోడ్ సైడ్ కు చిన్న స్టాల్ ఏర్పాటు చేసి అందులో  రూ.50 కి ఒక బిర్యానీ ప్యాకెట్ అమ్ముతుంది. ఎవరైనా ఆకలితో వస్తే బిర్యానీ ఉచితంగానే పెడుతుంది ఆ మహిళ. తక్కువ ధరకు బిర్యానీ అమ్మడానికి కారణం కూడా ఉందంటుంది . కోయంబత్తూర్ లో తక్కవ ధరకే బిర్యానీ అందించడమే లక్ష్యంగా, అందరి ఆకలీ తీర్చాలనే ఉద్దేశంతోనే తక్కువ ధరకు బిర్యానీ అమ్ముతున్నట్లు చెప్పింది మహిళ. సాధారణంగా బిర్యానీ తినాలనే కోరిక చాలా మందికి ఉంటుంది కానీ డబ్బు ఉండదు. అలాంటి వారి కోసం తక్కువ ధరకు అమ్ముంది. తక్కువ ధరకు బిర్యానీ అమ్ముతూ..ఆకలితో ఉన్నవారికి ఫ్రీగా పెడుతున్న ఆ మహిళపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు.

see more news

రేషన్ షాపుల్లోనే ఆధార్-ఫోన్ నెంబర్ లింకింగ్

ఆగకుండా ఎక్కిళ్లు వస్తున్నాయా? ఇలా చేయండి..