
లక్నో: కన్న కొడుకుతో పాటు ఓ మహాళ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఫతేపూర్ జిల్లాలోని, హరిహర్‌గంజ్‌కు చెందిన ఉమేశ్ కుమార్ పటేల్, అర్చనా పటేల్ ఇద్దరూ భార్యాభర్తలు. ఉమేశ్ కుమార్ కాన్స్‌పూర్ రైల్వేస్టేషన్‌లో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. అర్చనా పటేల్ గృహిణి. అయితే, ఈ మధ్య ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన అర్చన బుధవారం తన 9 నెలల కొడుకుతో కలిసి రన్నింగ్ ట్రైన్ ముందు దూకింది. ఈ ఘటనలో తల్లీకొడుకు ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టానికి తరలించి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న అర్చన కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.