
హైదరాబాద్ నగరంలోని హయత్ నగర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు మహిళను మెడపై నరికి దారుణంగా హతమార్చారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రెండు రోజుల క్రితం హత్య జరిగినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న క్ల్యూస్ టీం, డాగ్ స్కాడ్స్ చేరుకున్నాయి. మృతురాలు మెదక్ జిల్లా జోగిపేట్ మండలం యారారంకు చెందిన బేతమ్మగా గుర్తించారు.