మందు, సిగరెట్ తాగని వరుడు కావలెను

మందు, సిగరెట్ తాగని వరుడు కావలెను

అమ్మ కోసం మరో అమ్మాయి…

  • ఆస్తా వర్మను చూసి ఇన్‌స్పైర్ అయిన మోహిని
  • 56 ఏళ్ల తల్లి కోసం ట్విట్టర్‌లో మాట్రిమోనియల్ ప్రకటన

నిన్న ఆస్తా వర్మ.. నేడు మోహిని.. పెళ్లి ప్రకటనల్లో కొత్త ట్రెండ్‌కు బాటలేసిన యువతులుగా ట్విట్టర్లో వైరల్ అవుతున్నారు. గత నెల 31న ఆస్తా వర్మ తన తల్లికి మంచి గుణాలున్న 50 ఏళ్ల వరుడు కావాలంటూ #Groomhunting అనే హ్యాష్ ట్యాగ్‌తో ట్వీట్ చేసింది. ఆమె ఐడియాకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఈ బిజీ లైఫ్‌లో అమ్మకు తోడు కల్పించాలన్న ఆలోచన భేష్ అంటూ మెచ్చున్నారు. చాలా మంది ఆమె చెప్పిన క్వాలిటీస్‌తో పెళ్లి కొడుకు ఫొటోలను కూడా ట్వీట్ చేశారు.

ఆ ఐడియాను చూసి ఇన్‌స్పైర్ అయింది మోహిని అనే యువతి. ఆస్తా వర్మ స్ఫూర్తితో తన 56 ఏళ్ల తల్లి కోసం మరోసారి పెండ్లికొడుకు వేట మొదలుపెడుతున్నానంటూ ట్వీట్ చేసింది. ‘అమ్మను ప్రేమ చూసుకునే నాన్న కావాలి. 55-60 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. మందు, మాంసం, సిగరెట్ లాంటివి ముట్టకూడదు. అమ్మకు మంచి తోడుగా ఉంటూ నన్నూ ప్రేమగా చూసుకోవాలి’ అని కండిషన్లను వివరిస్తూ తల్లితో కలిసి దిగిన సెల్ఫీని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది మోహిని. #Groomhunting #everyonedeservesaprtner #lookingfordad అన్న హ్యష్ ట్యాగ్స్‌తో పెట్టిన ఆమె పోస్టు ట్విట్టర్‌లో వైరల్‌గా మారింది.

అమ్మ సంతోషం కోరుకుంటున్నా..

మోహిని పోస్టును చూసిన ఆస్తా వర్మ ఆ ట్వీట్‌పై స్పందించింది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికీ మంచి పాట్నర్‌ను పొందే హక్కు ఉందని చెప్పిందామె. దీని ఆడా, మగా అన్న తేడా లేదని, ఎవరికైనా సంతోషంగా చూసుకునే తోడు ముఖ్యమని ఆస్తా చెప్పింది. ‘మీ అమ్మను సంతోషంగా చూసుకునే వారు దొరకాలని కోరుకుంటన్నా’ అంటూ మోహిని పోస్టును రీ ట్వీట్ చేసింది ఆస్తా వర్మ.

అలాగే చాలా మంది నెటిజన్లు గుడ్ లక్ చెప్పారు. ఆమెకు మంచి తోడు దొరకాలని కోరుకుంటున్నామని కామెంట్లు పెట్టారు కొందరు. నీకు మంచి తండ్రి దొరకాలంటూ మరికొందరు కామెంట్ చేశారు.

ఆస్తా వర్మ ఇలా..

ఆస్తా వర్మ అనే యువతి. లా స్టూడెంట్. ఈ బిజీ లైఫ్ లో తల్లికి మంచి తోడునివ్వాలన్న కోరికతో తల్లితో సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను పోస్ట్ చేసింది. ‘మా అమ్మ కోసం 50ఏళ్ల వరుడు కావాలి’ అంటూ అక్టోబర్ 31న రాత్రి ట్వీట్ చేసిందామె. మంచి అందగాడు, వెజిటేరియన్ అయ్యుండాలి, మద్యం తాగకూడదు, మంచిగా సెలిట్ అయిన వ్యక్తి కావాలి అంటూ షరతులతో ట్వీట్ చేసింది.