ఆరు రోజుల బిడ్డ.. రూ.60 వేలకు అమ్మకం

ఆరు రోజుల బిడ్డ.. రూ.60 వేలకు అమ్మకం

పశ్చిమ బెంగాల్‌లోని నదియా జిల్లాలో తన ఆరు రోజుల మనవరాలిని పిల్లల అక్రమ రవాణా రాకెట్‌కు విక్రయించినట్లు ఓ మహిళపై ఆరోపణలు వచ్చాయి.  ప్రస్తుతం ఆమె పరారీలో ఉందని, ఆమెను పట్టుకునేందుకు విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు. ఈరోజు ఉదయం పసికందు కనిపించకపోవడంతో తల్లి వెంటనే.. శాంతిపూర్‌లోని స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

ఈ వ్యవహరంలో ఖలీదా బీబీ అనే నిందితురాలు పరారీలో ఉండటమే కాకుండా శిశువును విక్రయించేందుకు ఏజెంట్‌గా వ్యవహరించినట్లు పోలీస్ లు భావిస్తున్నారు. ఇందులో మరో మహిళ కూడా పరారీలో ఉందని పోలీసులు తెలిపారు. ఫిర్యాదు చేసిన ఆ తల్లి.. అక్టోబర్ 9న ప్రసవించగా, మూడు రోజుల తరువాత, ఆమె నవజాత శిశువుతో తన తల్లి ఇంటికి వెళ్లింది. అనంతరం ఆ బిడ్డను విక్రయించాలని మహిళ తల్లి ఒత్తిడి చేసింది. కానీ దానికి ఆ శిశువు తల్లి ఒప్పుకోలేదు.

ఈ క్రమంలో అక్టోబర్ 15న తన బిడ్డ కనిపించకపోవడంతో ఆ మహిళ స్థానిక ఏజెంట్ సహాయంతో పసికందును రూ.60 వేలకు విక్రయించినట్లు అంగీకరించిన తల్లితో గొడవపడిందని ఫిర్యాదులో తెలిపింది. అయితే పోలీసులకు సమాచారం అందేలోపే నిందితులు తప్పించుకున్నారు. మహిళ భర్త పశ్చిమ బెంగాల్‌ లో ఉద్యోగం చేస్తున్నందున, ప్రసవించిన తర్వాత తన తల్లి వద్దకు వెళ్లడం తెలివైన పని అని ఆమె భావించిందని పోలీసులు తెలిపారు. తన తల్లి ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేదని ఆ మహిళ అంగీకరించింది.

“పోలీసులు నా కూతుర్ని ట్రాక్ చేసి నా దగ్గరకు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఇంత ఘోరమైన నేరం చేసిన నా తల్లిని శిక్షిస్తారని నేను కూడా ఆశిస్తున్నాను”అని మహిళ చెప్పుకొచ్చింది.