ఆవేశంతో ఊగిపోయింది.. వృద్ధుడిని కొట్టింది.. చివరకు..

ఆవేశంతో ఊగిపోయింది.. వృద్ధుడిని కొట్టింది.. చివరకు..

కొందరు ప్రతి చిన్న విషయానికి ఆవేశానికి గురవుతున్నారు. పెద్ద ..చిన్న.. వయస్సు తారతమ్యం లేకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు.  అలా వ్యవహరించడమే కాకుండా.. అలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నానా రచ్చ చేస్తున్నారు.  సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయితే అంత గొప్పనుకుంటున్నారో ఏమో కాని ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ యుగం నడుస్తోంది.  తాజాగా  ఉత్తర ప్రదేశ్ ఓ మహిళ ఓ వృద్దుడిని కొట్టిన వీడియో హల్ చ్ చేస్తుంది. 

వివరాల్లోకివెళ్తే.... ఓ మహిళ.. వృద్ధుడిని దారుణంగా కర్రతో కొట్టిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.  ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.  ఓ మహిళ వీధి కుక్కలకు ఆహారం పెడుతుంటే ఓ వృద్దుడు అభ్యంతరం వ్యక్తం చేశాడు.  ఇక అంతే నాకే చెపుతావా అనుకుందో ఏమో తెలియదు కాని తండ్రి వయస్సున్న వ్యక్తి అని కూడా చూడకుండా కర్రతో దారుణంగా కొట్టింది.  

ఘజియాబాద్ క్రాసింగ్ రిపబ్లిక్‌ ప్రాంతంలోని పంచశీల్ హౌసింగ్‌ సొసైటీకి చెందిన 23 ఏండ్ల సిమ్రాన్‌ మంగళవారం( ఆగస్గు 1)  రాత్రి వేళ వీధి కుక్కలకు ఆహారం పెట్టింది. అయితే అదే హౌసింగ్‌ సొసైటీకి చెందిన 78 ఏళ్ల రూప్‌నారాయణ మెహ్రా దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. వీధి కుక్కలకు అక్కడ ఆహారం పెట్టవద్దని, మరోచోట పెట్టాలని చెప్పాడు. కుక్కలు జనాల్ని కరుస్తున్నాయని అన్నాడు.దీంతో సిమ్రాన్‌ దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వాచ్‌మెన్‌ చేతిలోని కర్ర తీసుకుని వృద్ధుడిపై దాడి చేసింది. అపార్ట్‌మెంట్‌ వాసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ ఆమె వెనక్కి తగ్గలేదు. వృద్ధుడ్ని పలుమార్లు కర్రతో కొట్టింది. రూప్‌నారాయణ మెహ్రా కుటుంబం ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో సిమ్రాన్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్‌ చేశారు.ఈ వీడియో క్లిప్‌ చూసి నెటిజన్లు షాక్‌ అయ్యారు. ఆ మహిళ కర్రతో వృద్ధుడ్ని కొట్టడాన్ని చాలా మంది తప్పుపట్టారు.