ఎమ్మెల్యే రేగా కాంతారావు నా భూమి కబ్జా చేసిండు: బాధితురాలు

ఎమ్మెల్యే రేగా కాంతారావు నా భూమి కబ్జా చేసిండు: బాధితురాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే రేగా కాంతారావు తన భూమి కబ్జా చేశారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  ఓ మహిళ ఆందోళనకు దిగింది. పినపాక నియోజకవర్గంలోని మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో తన నాలుగు ఎకరాల భూమిని రేగా కాంతారావు  ఆక్రమించారంటూ బాధితురాలు మునిగల పిచ్చమ్మ  ఆరోపించారు. తన అత్తమామలు సంపాదించిన భూమిని తనకు ఇప్పించాలని కోరింది. ఎమ్మెల్యేనే భూ కబ్జాలకు పాల్పడితే తాము ఎవరికి చెప్పుకోవాలని  ఆవేదన వ్యక్తం చేసింది.  తహసిల్దార్,   ఎమ్మెల్యే కాంతారావు స్పందించి తన భూమి తనకు ఇప్పించాలని విజ్ఞప్తి చేసింది.