కొబ్బరి చిప్పలతో అలంకరణ వస్తువులు

కొబ్బరి చిప్పలతో అలంకరణ వస్తువులు

అశ్వారావుపేట, వెలుగు: అశ్వారావుపేట అగ్రికల్చర్​ కాలేజీ, కొబ్బరి అభివృద్ధి బోర్డు విజయవాడ కేంద్రం సంయుక్తంగా జూన్ 30 నుంచి జూలై 5 వరకు పలువురికి శిక్షణ ఇచ్చింది. 30 మంది మహిళలకు అశ్వారావుపేటలో కొబ్బరి చిప్పలతో అలంకరణ వస్తువుల తయారీపై ట్రైనింగ్​ ఇచ్చారు. వారు తయారుచేసిన గృహ అలంకరణ వస్తువులు ఆకట్టుకుంటున్నాయి. శనివారం ముగింపు కార్యక్రమానికి అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ రవికుమార్ హాజరయ్యారు. 

ఈ అలంకరణ వస్తువుల ద్వారా నిరుద్యోగ మహిళలు, యువత స్వయం ఉపాధి పొందవచ్చన్నారు. పర్యావరణహితమైన ఈ వస్తువులకు మార్కెట్​లో మంచి డిమాండ్ ఉందని చెప్పారు. శిక్షణ పొందిన మహిళలు కొబ్బరిచిప్పలతో పూల కుండీలు, టీ కప్పులు, కిడ్డీ బాగ్స్, ఇయర్ రింగ్స్, మ్యూజికల్ ఇంస్ట్రుమెంట్స్, ఫొటో ప్రేమ్, తాబేలు బొమ్మలు, పిల్లల ఆటవస్తువులను తయారుచేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో బిహార్ నుంచి వచ్చిన మాస్టర్ ట్రైనర్  నికుంజా పాల్గొన్నారు.