ఆత్మగౌరవం ఉన్న మహిళలపై రేప్ జరిగితే ఆత్మహత్య చేసుకుంటారు : కాంగ్రెస్ చీఫ్

ఆత్మగౌరవం ఉన్న మహిళలపై రేప్ జరిగితే ఆత్మహత్య చేసుకుంటారు : కాంగ్రెస్ చీఫ్

కేరళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముల్లపల్లి రామచంద్రన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  కేరళ రాజధాని తిరువనంతపురంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆధ్వర్యంలో  జరిగిన నిరసన కార్యక్రమంలో ముల్లపల్లి రామచంద్రన్ మాట్లాడారు.

2013 సోలార్‌ కుంభకోణంలో ప్రధాన నిందితురాలు సరిత నాయర్ వంటి వారిని తీసుకురావడం ద్వారా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్  బ్లాక్ మెయిల్ రాజకీయాలకు  ప్రయత్నిస్తున్నారని కేపీసీసీ చీఫ్ ఆరోపించారు. ఒక మహిళ తనపై ఒకసారి లైంగికదాడి జరిగిందని చెబితే మనం అర్థం చేసుకోవచ్చు. అదే ఆత్మగౌరవంతో బతికే మహిళ తనపై మళ్లీ లైంగికదాడి జరిగిందని చెప్పకుండా చనిపోతారు లేదా మరలా అలా జరగనివ్వరు  అని అన్నారు.

ముల్లపల్లి రామచంద్రన్‌ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో.. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. ఈ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని, దీని నుంచి బయటపడటానికి మార్గాలను పరిశీలిస్తున్నానని చెప్పడానికి ప్రయత్నిస్తున్నానని అన్నారు.