బోణీ అదిరింది : ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్ పై మిథాలీ సేన విక్టరీ

బోణీ అదిరింది : ఇంగ్లాండ్ విమెన్స్ టీమ్ పై మిథాలీ సేన విక్టరీ

ముంబై : టీమిండియా బౌలర్లు ఎక్తా బిస్త్‌‌‌‌ (4/25), దీప్తి శర్మ (2/33), శిఖా పాం డే ( 2/21) సూపర్‌ స్పెల్‌‌‌‌తో ఇంగ్లం డ్‌ విమెన్స్‌‌‌‌ టీమ్‌ తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా విమెన్స్‌‌‌‌ టీమ్‌ 66 రన్స్‌‌‌‌ తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో 1–0 ఆధిక్యంలో నిలిచింది. మొదట బ్యాటిం గ్‌ చేసిన ఇండియా ఓపెనర్లు జెమీమా రోడ్రిగ్స్‌‌‌‌ (48: 58 బాల్స్‌‌‌‌లో, 8×4), స్మృతి మంధాన ( 24: 42 బాల్స్‌‌‌‌లో, 3×4), కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (44: 74 బాల్స్‌‌‌‌లో, 4×4) , తానియా భాటియా (25) రాణించడంతో 49.4 ఓవర్లలో 202 రన్స్‌‌‌‌ చేసి ఆలౌట్‌ అయింది. ఆ తర్వా త బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ .. ఇండియా బౌలర్ల దెబ్బకు 41 ఓవర్లలో 136 రన్స్‌‌‌‌కే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ ప్లేయర్లలో కెప్టెన్‌ నైట్‌ ( 39: 64 బాల్స్‌‌‌‌లో 2×4), స్కీవర్‌ ( 44: 66 బాల్స్‌‌‌‌లో 5×4) మాత్రమే రాణించారు. 38 రన్స్‌‌‌‌కే మూడు వికెట్లు నష్టపోయిన ఇంగ్లండ్‌ ను నైట్‌ , స్కీవర్‌ ఆదుకున్నారు.

31వ ఓవర్‌ లో , స్కీవర్‌ అవుటవడంతో మళ్లీ ఇంగ్లండ్‌ పతనం మొదలైంది. మరో 25రన్స్‌‌‌‌కే మిగతా 6 వికెట్లూ చేజార్చుకుంది. 40వ ఓవర్లో ఏక్తా బిస్త్‌‌‌‌  3 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ ను దెబ్బ తీసింది. 25 రన్స్‌‌‌‌కే 4 వికెట్లు పడగొట్టిన ఏక్తాకు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డ్‌‌‌‌ దక్కింది.

రెండు టీమ్స్ స్కోర్

ఇండియా విమెన్స్‌ : 49.4 ఓవర్లలో 202 ఆలౌట్‌

( రోడ్రిగ్స్‌‌‌‌ 48, మంధాన 24, మిథాలీ 44, గో

స్వామి 30),

ఇంగ్లండ్‌ :41 ఓవర్లలో 136 ఆలౌట్‌

( నైట్‌ 39, స్కీవర్‌ 44; ఎక్తా బిస్త్‌‌‌‌ 4/25, దీప్తి శర్మ

2/33, శిఖా పాం డే 2/21).