Women's ODI World Cup 2025: రేపటి నుంచి (అక్టోబర్ 29) సెమీస్ సమరం.. షెడ్యూల్, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!

Women's ODI World Cup 2025: రేపటి నుంచి (అక్టోబర్ 29) సెమీస్ సమరం.. షెడ్యూల్, టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు!

మహిళల వరల్డ్ కప్ లో నాకౌట్ కు రంగం సిద్ధమైంది. బుధవారం (అక్టోబర్ 29) నుంచి సెమీ ఫైనల్స్ ప్రారంభం కానున్నాయి. అంచనాలకు తగ్గట్టుగా ఆడి ఇండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. ఆస్ట్రేలియా (13) ఆడిన అన్ని మ్యాచ్ ల్లో విజయం సాధించి  పాయింట్ల పట్టికలో అగ్ర స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ (11), సౌతాఫ్రికా (10), ఇండియా (7) వరుసగా  రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. షెడ్యూల్ ప్రకారం పాయింట్ల పట్టికలో తొలి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీస్ ఆడాల్సి ఉంది.. రెండు, మూడు స్థానాల్లో నిలిచిన జట్టు మరో సెమీ ఫైనల్లో తలపడతాయి. 

తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బుధవారం (అక్టోబర్ 29) జరుగుతుంది. రేపు గౌహతి వేదికగా  బార్సపార క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఈ టోర్నీలో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో సౌతాఫ్రికా ఘోరంగా ఓడిపోయింది. మరో సెమీస్ లో ఇండియాతో ఆస్ట్రేలియా తలపడుతుంది. ఈ మ్యాచ్ గురువారం (అక్టోబర్ 30) జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ లో ఇండియాపై ఆస్ట్రేలియా ఉత్కంఠ విజయం సాధించింది.  ఆదివారం (నవంబర్ 2) ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.              

సెమీ ఫైనల్, ఫైనల్ షెడ్యూల్:

తొలి సెమీ ఫైనల్: సౌతాఫ్రికా vs ఇంగ్లాండ్  

అక్టోబర్ 29- బుధవారం-  గౌహతి, బార్సపార క్రికెట్ స్టేడియం (మధ్యాహ్నం 3:00 గంటలకు)
 
రెండో సెమీ ఫైనల్: ఆస్ట్రేలియా vs ఇండియా 

 అక్టోబర్ 30-  గురువారం-   నవీ ముంబై, డివై పాటిల్ స్టేడియం (మధ్యాహ్నం 3:00 గంటలకు)

ఫైనల్ మ్యాచ్: నవీ ముంబై, డివై పాటిల్ స్టేడియం- నవంబర్ 2 (మధ్యాహ్నం 3:00 గంటలకు)

టైమింగ్, లైవ్ స్ట్రీమింగ్, టెలికాస్టింగ్ వివరాలు:

లైవ్ టెలికాస్ట్:  స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ మూడు వన్డేలను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది

లైవ్ స్ట్రీమింగ్: జియో సినిమా యాప్, వెబ్‌సైట్ లో ప్రత్యక్ష ప్రసారం అందుబాటులో ఉంటుంది.  

►ALSO READ | Ranji Trophy 2025-26: అగార్కర్ ఇప్పుడేమంటావ్: రెండు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు.. రీ ఎంట్రీ ఫిక్స్ చేసుకోండి!