దేవర మూవీ సెట్‌‌‌‌‌‌‌‌లోని వర్కింగ్ స్టిల్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

దేవర మూవీ సెట్‌‌‌‌‌‌‌‌లోని వర్కింగ్ స్టిల్‌‌‌‌‌‌‌‌ రిలీజ్

ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘దేవర’.  హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా భారీ అంచనాల మధ్య ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ మూవీ కొత్త షెడ్యూల్ గోవాలో  జరుగుతోంది. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీలో  మాంటేజ్ సాంగ్‌‌‌‌‌‌‌‌ను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సెట్‌‌‌‌‌‌‌‌లోని వర్కింగ్ స్టిల్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో ఎన్టీఆర్ సరికొత్త లుక్‌‌‌‌‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. పంచె కట్టుకుని, గల్ల చొక్కా వేసుకుని, భుజం పైన కండువాతో డిఫరెంట్ లుక్‌‌‌‌‌‌‌‌లో ఆకట్టుకుంటున్నాడు.

 పక్కనే దర్శకుడు కొరటాల శివ, రాజు సుందరం మాస్టర్ ఉన్నారు.  అలాగే  ఎన్టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇతర నటీనటులతో బీచ్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో కొన్ని కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారట.  జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా నటిస్తున్న  ఈ చిత్రంలో సైఫ్ అలీఖాన్ విలన్‌‌‌‌‌‌‌‌గా కనిపించనున్నాడు.  ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌‌‌‌‌‌‌‌గా విడుదలైన టీజర్ సినిమాపై బజ్‌‌‌‌‌‌‌‌ను పెంచింది.  కళ్యాణ్ రామ్ సమర్పణలో సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు.  రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌‌‌‌‌‌‌ దసరా కానుకగా  అక్టోబర్ 10న  వరల్డ్‌‌‌‌‌‌‌‌ వైడ్‌‌‌‌‌‌‌‌గా విడుదల కానుంది. ‘జనతా గ్యారేజ్’ తర్వాత ఎన్టీఆర్,కొరటాల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి.