అక్టోబర్ 12న ప్రపంచ అర్ధరైటిస్ డే

అక్టోబర్ 12న ప్రపంచ అర్ధరైటిస్ డే

మహబూబ్ నగర్ టౌన్, వెలుగు :  ప్రపంచ ఆర్థరైటిస్ డే పురస్కరించుకుని ఈనెల 12న నగరంలోని  శ్రీకృష్ణ టెంపుల్ కమాన్ నుంచి ఎస్​వీఎస్ ఆస్పత్రి వరకు ర్యాలీ నిర్వహించనున్నట్లు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ ఎస్​వీఎస్ ఆస్పత్రి డైరెక్టర్ కేజే రెడ్డి తెలిపారు. గురువారం  నగరంలోని ఎస్​వీఎస్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సెమినార్ హాల్​లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈనెల 12న ఎస్​వీఎస్ ఆస్పత్రిలో తెలంగాణ ఆర్థోపెడిక్ అసోసియేషన్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. 

ఈ సమావేశానికి ప్రపంచ వ్యాప్తంగా 400 మంది డెలిగేట్స్,70 మంది ఫ్యాకల్టీలు వస్తున్నారని వెల్లడించారు. సర్జరీ జరిగిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్పోర్ట్స్ ఇంజురీస్ ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి, స్పైన్ సర్జరీలు, ట్రామా జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీల గురించి వైద్యసిబ్బందికి అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ వీఎస్ ఆస్పత్రి రెసిడెంట్ డైరెక్టర్ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.