లోకానికి రంది పట్టింది

లోకానికి రంది పట్టింది
  • బాధ, కోపం,ఒత్తిడితో  జనం సతమతం
  • 39 శాతం మందికి ఏదో ఒక ఆందోళన
  • జాబితాలో చాద్‌‌​కు ఫస్ట్​ ప్లేస్
  • బాధకు సమాంతరంగా ఎంజాయ్ మెంట్
  • 71 శాతం మందిది అదే మాట..గాలప్ సర్వే

ఆనందం, బాధ, కోపం, ఒత్తిడి , భయం, ఆశ్చర్యం .. మనిషికి బేసిక్ గా ఉండే భావాలివి.అందులో ఏదొచ్చినా ఉండబట్టలేం. మరి, ప్రపంచం ఆ భావాలను ఎలా పలికిస్తోం ది?లోకంల ఎక్కడెక్కడ ఎట్లున్నరు? వారి పరిస్థితులేంటి ? దీనిపైనే అమెరికాకు చెందినగాలప్ అనే సంస్థ సర్వే చేసింది. 143 దేశాలకు చెందిన 1.5 లక్షల మంది పాజిటివ్ ,నెగెటివ్ ఎమోషన్ లను ఫోన్ లేదా నేరుగా ఇంటర్వ్యూ చేసి సేకరించింది.

లోకానికి రంది పట్టింది. కంగారు, ఒత్తిడి, బాధతో సతమతమవుతోంది. 39 శాతం మంది జనం తమకూ ఏదో ఒక ఆందోళన ఉంటోందని చెప్పారు. 35 శాతం మంది ఒత్తిడి తట్టుకోలేకపోతున్నామన్నారు. శారీరక  శ్రమ తెగ ఇబ్బంది పెడుతోందని మరో 31 శాతం మంది గోడు చెప్పుకున్నరు. మనసును బాధ పట్టి పీడిస్తోందని 24 శాతం మంది చెబితే,కోపంతో ఊగిపోతున్నామని 22 శాతం మంది తమ ఎమోషన్ ను వెళ్లగక్కా రు. ఈ జాబితాలో చాద్‌ రిపబ్లిక్‌‌ మొదటి స్థానంలో నిలిచింది. 54 స్కో రుతో నెగెటివ్ఎమోషన్స్ (ప్రతికూల భావాలు) ఎక్కువున్న దేశంగా స్థానం దక్కిం చుకుంది. హింస, మౌలిక వసతులు లేకపోవడం, పునరావాసాలతో ఆ దేశంపై నెగెటివ్ ప్రభావం ఎక్కువగా పడిందని రీసెర్చ్ లో తేలింది. పొట్ట నింపుకోవడానికి కష్టపడాల్సి వచ్చిం దని 72శాతం మంది చాద్‌ రిపబ్లిక్‌‌​ ప్రజలు అభిప్రాయపడ్డారు. శారీరకంగా పెద్ద దెబ్బే పడుతోం దని 66 శాతంమంది చెప్పారు. బాధ (54%), ఒత్తిడి (51%)తో సతమతమవుతున్నామంటున్నారు. దాని పక్క దేశాలైనసౌత్ సూడాన్ , సెం ట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ లూ దాన్ని అనుసరిం చాయి. ఈ జాబితాలో అతి తక్కువ నెగెటివ్ ప్రభావాన్ని ఎదుర్కొంటున్న దేశాల జాబితాలో అజర్ బైజాన్ , కిర్గిస్థాన్ , లాట్వియా, స్వీడన్ వంటి దేశాలు-న్నాయి. వాటికి 19 స్కో రు వచ్చిం ది.

మనదేశం బెటరే!

బాధ, ఒత్తిడి, కోపమే కా దు.. హ్యాపీగానూ గడుపుతున్నోళ్లున్నారు. 71 శాతం మంది.. సర్వే కు ముందురోజు వరకు ఫుల్ ఎంజాయ్ చేశామని చెప్పారు. 72శాతం మంది హాయిగా రెస్ట్ తీసుకున్నామన్నారు. నవ్వుతూ హ్యాపీగా గడిపామని 74 శాతం మంది, ఎదుటి వారి నుంచి సరైన గౌరవం పొం దామని 87శాతం మంది చెప్పుకొచ్చారు. ఈ జాబితాలో లాటిన్ అమెరికా దేశాలు ముందు వరుసలో నిలిచాయి. 85 స్కో రుతో పరాగ్వే, పనామాలు మొదటి రెండు స్థానా-ల్లో నిలిచాయి. సరిహద్దు ఆందోళనలతో అట్టుడుకుతున్న గ్వాటి మాలా, మె క్సికోలూ మె రుగైన స్థానాలు దక్కిం చుకున్నాయి. ఈ జాబితాలో ఆఫ్గనిస్థాన్ అట్టడుగు స్థానానికి పరిమితమైంది. కేవలం 43పాయిం ట్లు సాధించింది ఆ దేశం. ఇక, 49 శాతంమంది జనం మంచి విషయాలు నేర్చుకుంటు న్నామని చెప్పారు. మొత్తం ఎమోషనల్ దేశాల జాబితాలో నైజర్ మొదటి స్థానంలో ని లిచింది. దాదాపు 60శాతం మంది ఏదో ఒక ఎమోషన్ తో ఉంటున్నారట.ఫిలప్పీన్స్ , ఈక్వెడా ర్ లలోనూ 60 శాతం మందిచొప్పున ఎమోషన్స్ తో ఉన్నారట. గాలప్ నివేదికలో ఇండియా గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. కానీ,మ్యాపులను బట్టి పాజిటివ్ , నెగెటివ్ ఎమోషన్లలో ఇండియా మెరుగైన స్థానాల్లోనే ఉన్నట్టు తెలుస్తోంది.

పాజిటివ్ ఎమోషన్స్ లో టాప్ దేశాలు

దేశం               స్కోరు

పరాగ్వే__          85

పనామా            85

గ్వాటిమాలా       84

మెక్సికో_           84

ఎల్ సాల్వడార్    83

ఇండొనేసియా     83

హోండురస్         83

ఈక్వెడార్          82

కోస్టారికా           81

కొలంబియా       81

నెగెటివ్ ఎమోషన్స్ లో టాప్ దేశాలు

దేశం                    స్కోరు

చాద్‌ రిపబ్లిక్‌           54

నైగర్                     50

సియెరా లియోన్      50

ఇరాక్​__                49

ఇరాన్                   49

బెనిన్                   47

లైబీరియా              47

గినీ                     45

పాలస్తీనా             44

కాం గో                43

మొరాకో__          43

టోగో                   43

ఉగాం డా             43