కరోనా ఎఫెక్ట్.. ప్రపంచం చూపు భారత్ వైపు

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచం చూపు భారత్ వైపు

న్యూఢిల్లీ: కరోనాపై యుద్ధంలో తీవ్రంగా కృషి చేస్తున్న ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య రంగాలను ప్రధాని మోడీ అభినందించారు. ‘గతేడాది దేశంతోపాటు మొత్తం ప్రపంచానికి చాలా క్లిష్టమైన సమయం. కరోనా మీద యుద్ధంలో గెలుపులో ప్రైవేట్ రంగ కృషి చాలా ఉంది. భవిష్యత్‌‌లో ఏమైనా రోగాలు వచ్చినా వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కరోనా మనకు పాఠాలు నేర్పింది. ఆరోగ్య రంగంలో మనం మరింత మెరుగ్గా అవ్వాల్సి ఉంది. మెడికల్ ఎక్విప్‌‌మెంట్, మెడిసిన్స్, వెంటిలేటర్స్, వ్యాక్సిన్, డాక్టర్లు, ఎపిడమాలజిస్ట్‌‌ల వరకు అన్ని సౌకర్యాలపై దృష్టి పెట్టాల్సి ఉంది’ అని మోడీ చెప్పారు. హెల్త్ సెక్టార్‌‌కు సంబంధించి బడ్జెట్‌ విషయంలో వెనకడుగు వేయబోమని, ఈ రంగానికి చాలా ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. కరోనాతో హెల్త్ సెక్టార్ విషయంలో ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయని పేర్కొన్నారు. భవిష్యత్‌‌లో మన దేశ మెడికల్ ఎడ్యుకేషన్, డాక్టర్లు, నర్సులకు డిమాండ్ బాగా పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.