76 అడుగుల మేరీమాత విగ్రహం ఆవిష్కరణ

76 అడుగుల మేరీమాత విగ్రహం ఆవిష్కరణ

కూసుమంచి, వెలుగు : పాలేరు మేరీ మాత క్షేత్రంలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద 76 అడుగుల మేరీమాత విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. పాలేరు ఫాదర్  కొమ్ము అంటోని మత గురువుగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో సిల్వర్ జూబ్లీ వేడుకగా నిర్వహించారు. తొలుత పాలేరు చెక్​పోస్ట్ నుంచి మేరీ మాత క్షేత్రం వరకు కళారూపాలతో శోభాయాత్ర నిర్వహించారు.  జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చినవారు డప్పు, కోలాటం, కొమ్ము నృత్యాలతొ శోభాయాత్ర ఆకట్టుకుంది. 

ఈ సందర్భంగా ఫాదర్ కొమ్ము అంటోని, ఖమ్మం పీఠాధిపతి డాక్టర్ సగిలి ప్రకాశ్, నల్గొండ బిషప్​​ కరణం ధమన్, వరంగల్ బిషప్ డాక్టర్ ఉడుముల బాల, ఖమ్మం విశ్రాంత బిషప్ మైపన్ పాల్, వరంగల్ ప్రొవెన్షియల్ సుపీరియర్ సిస్టర్ బిజీ జోసఫ్​ ను ప్రత్యేక వాహనంలో ఊరేగించారు. అనంతరం క్షేత్రం ప్రత్యేక ముఖద్వారాన్ని, ఏసుప్రభు, మరియమాత, మేరీ మాత  విగ్రహాలను అతిధులు ఆవిష్కరించారు. ఈ వేడుకల్లో ఉత్సవాల కమిటీ కన్వీనర్ కొమ్ము ప్రసాద్,  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన వందమంది మత గురువులు, వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.