‘చిన్న’పాప.. విధిని గెలిచింది

‘చిన్న’పాప.. విధిని గెలిచింది

ప్రపంచంలోనే అత్యంత ‘చిన్న’ది ఆ పాప. 245 గ్రాముల బరువుతోనే పుట్టింది. కష్టం.. బతకదు అని డాక్టర్లు చెప్పారు. కానీ, ఆ తల్లిదండ్రులు హాస్పిటల్​లోనే ఉంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చిన్నారిని బతికించుకున్నారు. ఆ పాప పేరు సేబీ. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటారు ఆ చిన్నారి తల్లిదండ్రులు. అయితే గత ఏడాది డిసెంబర్​లో నెలలు నిండకముందే సేబీ పుట్టింది. ప్రీ ఎక్లాంప్సియా (హై బీపీ)తో ఆమె తల్లికి ముందే ఆపరేషన్​ చేయాలని డాక్టర్లు చెప్పారు.

దీంతో 23 వారాల మూడు రోజులకు ప్రపంచాన్ని చూసింది. యాపిల్​ పండంత సైజులోనే పుట్టింది. దీంతో బతకలేదని కాన్పు చేసిన శాన్​డియాగో లోని షార్ప్​ మేరీ బిర్చ్​ హాస్పిటల్​ ఫర్​ వుమెన్​ అండ్​ న్యూబార్న్​ డాక్టర్లు చెప్పారు. తల్లిదండ్రుల పట్టుదలతో ఐదు నెలలు కంటికి రెప్పలా డాక్టర్లు, తల్లిదండ్రులు కాచుకున్నారు. ఇప్పుడు ఆ చిన్నారి బరువు 2.2 కిలోలు. సేబీని అని డాక్టర్లే పేరు పెట్టారు.