ఈ ఐస్ క్రీం ఖరీదు రూ.60వేలు.. స్పెషాలిటి అలాంటిది మరి

V6 Velugu Posted on Aug 01, 2021

హలో! మీకు ఐస్​క్రీమ్స్​ అంటే ఇష్టమా?  కొత్త కొత్త ఫ్లేవర్స్​ ట్రై చేయాలనుకుంటున్నారా! అయితే ఈ ‘బ్లాక్​ డైమండ్’​​ ఐస్​క్రీమ్​ తప్పకుండా టేస్ట్​ చేయాల్సిందే. కాకపోతే ఈ ఐస్​క్రీమ్​ తినాలంటే దుబాయ్​ వెళ్లాలి. ఐస్​క్రీమ్​ని అరవై వేలు పెట్టి కొనుక్కోవాలి. ఐస్​క్రీమ్​ అరవై వేలా ! అని ఆశ్చర్యపోకండి. ఈ ఐస్​క్రీమ్​​  స్పెషాలిటీ అలాంటిది మరి. 

వెనుకటి రోజుల్లో ఐదు, పది పైసలకే పుల్ల ఐసులు వచ్చేవి. ఆ తర్వాత వచ్చిన స్ట్రాబెర్రీ, బటర్​ స్కాచ్​, వెనిలా  లాంటి మరికొన్ని ఫ్లేవర్స్​ని​ కూడా రీజనబుల్​ ధరల్లోనే తినేయొచ్చు. కానీ, ఈ వరల్డ్ ఫేమస్​ ​ ‘బ్లాక్​ డైమండ్’​ ఐస్​క్రీమ్​ తినాలంటే అక్షరాల అరవైవేలు ఖర్చుపెట్టాల్సిందే. అన్నట్టు ఇది ఒక్క స్కూప్​ ఖరీదే. అసలు ఈ  ఐస్​ క్రీమ్​ ఎందుకింత కాస్ట్​లీ అనేగా మీ డౌట్​. ఎందుకంటే ఈ ఐస్​ క్రీమ్​పై బంగారు పూత చల్లుతారు. ఈ బంగారం చల్లిన బ్లాక్​ డైమండ్​ ఐస్​క్రీమ్​ దుబాయ్​లోని ‘స్కూపీ కేఫ్’​లో ​ 2015 నుంచే అమ్ముతున్నారు. బ్లాక్​ పుట్టగొడుగులు, కుంకుమ పువ్వుతో ఉన్న వెనిలా ఐస్​ క్రీమ్​పై 23 క్యారెట్ల బంగారం​ పూత చల్లి తయారుచేస్తారు. రీసెంట్​గా బాలీవుడ్​ యాక్ట్రెస్​ , ట్రావెలర్​ షెనాజ్ ట్రెజరీ కూడా ఈ ఐస్​క్రీమ్​ని టేస్ట్​ చేసింది. ఐస్​క్రీమ్​ తిన్నాక తన ఎక్స్​పీరియెన్స్​ని  ఇన్​స్టాగ్రామ్​లో  పోస్ట్​  చేసింది. దాంతో ఇప్పుడీ ‘బ్లాక్​ డైమండ్​’ సోషల్​మీడియాలో హాట్​ టాపిక్​ అయ్యింది. 

Tagged Dubais Black Diamond icecream, costs Rs.60000, World most expensive

Latest Videos

Subscribe Now

More News