
కర్ణాటకకు చెందిన రచయిత,రిటైర్డ్ ప్రొఫెసర్ కేఎస్ భగవాన్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెండు రోజులక్రితం కర్ణాటకలోని మాండ్యాలో జరిగిని ఓ కార్యక్రమంలో హిందువుల ఆరాధ్య దైవం రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారంటూ హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.. రాముడిపై కేఎస్ భగవాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది రెండోసారంటూ మండిపడ్డారు. కేఎస్ భగవాన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి సమాజంలో అశాంతి నెలకొల్పుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేఎస్ భగవాన్ రాసిన పుస్తకం ‘రామ మందిర యాకె బేడ’ లో కూడా రాముడ గురించి కామెంట్స్ చేశాడు. దీనిపై గతంలోనూ హిందు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.