వూహాన్ ల్యాబ్‌లో గబ్బిలాల పెంపకం?

వూహాన్ ల్యాబ్‌లో గబ్బిలాల పెంపకం?

కరోనా పురుడుపోసుకుంది ఎక్కడ. చైనాలోని వూహాన్ ల్యాబుల్లోనేనా..? మహమ్మారి వైరస్ మూలాల విషయంలో ల్యాబ్ థియరీ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. చైనాలోని వూహాన్ ల్యాబ్ నుంచే కరోనా పుట్టిందంటూ పలుదేశాలు గట్టిగా ఆరోపణలు చేస్తుండడమే కాదు.. తాము సేకరించిన ఆధారాలను అంతర్జాతీయ వేదికలమీద గట్టిగా చెబుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వూహాన్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ కు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది.
 వూహాన్ ల్యాబ్ ను 2017 మే నెలలో ప్రారంభించే సమయంలోన చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చిత్రీకరించిన ఓ వీడియోను స్కై న్యూస్ తాజాగా ప్రసారం చేసింది. ఈ వీడియోలోబోన్లలో గబ్బిలాలను పెంచుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. అక్కడి సైంటిస్టులు గబ్బిలాలను పట్టుకుని పురుగులను తినిపిస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా రికార్డయింది. 10 నిమిషాల నిడివి గల ఈ వీడియోలో ‘వూహాన్’ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పీ4 ల్యాబ్ నిర్మాణం, పరిశోధనలు’’ పేరు పెట్టారు. ల్యాబ్ లో పరిశోధనలు చిత్రీకరిచేందుకు కెమెరాలను కూడా పెట్టారు. 
కరోనా మూలాలు కనుగొనేందుకు దర్యాప్తు చేస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల బృందం వూహాన్ వెళ్లినప్పుడు అక్కడి అధికారులు మొక్కుబడిగా నివేదిక ఇచ్చి దులిపేసుకున్నారు. అక్కడ గబ్బిలాలు పెంచుతున్నారనే విషయాన్ని తొక్కిపెట్టారు. ల్యాబ్ కు గబ్బిలాలను తీసుకురాలేదు.. వాటి శరీరం నుంచి వైరస్ నమూనాలు కరించి తర్వాత వాటిని వదిలేశామని చెబుతున్నారు. అయితే 2019లో కరోనా వ్యాపించడానికి ముందే పీ4 ల్యాబ్ లోని చాలా పలువురు పరిశోధకులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల్లో చేరారు. వీరిలో కోవిడ్19 లక్షణాలు కనిపించినట్లు అమెరికా నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది. అంతర్జాతీయంగా నమ్మకమైన భాగస్వామి ద్వారా సమాచారం అమెరికా ధృవీకరించుకున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రచురించడం కలకలం రేపుతోంది. మల్లీ ప్రపంచ దేశాల వేళ్లన్నీ చైనా వైపే చూసేలా చేస్తోందీ కథనం.