ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ‘కార్తీక’ సందడి కనిపించింది. శుక్రవారంతో పాటు ఏకాదశి కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడం తో  ఆలయ పరిసరాలన్నీ కిటకిటలాడాయి. దీపారాధన స్టాళ్ల వద్ద భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు. భక్తుల రద్దీ కారణంగా సత్య నారాయణ స్వామి వ్రతాలను ఆరు బ్యాచులుగా నిర్వహించారు. వ్రతాల్లో మొత్తం 685 మంది పాల్గొన్నారు. కార్తీక పూజల అనంతరం భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. శుక్ర వారం కావడంతో అర్చకులు అమ్మవారికి ఊంజల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సేవ, లక్ష పుష్పార్చన నిర్వహించారు. పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ. 27,49,874 ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.

అభివృద్ధి పనులను స్పీడప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయండి

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లాలోని అన్ని మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులపై స్పెషల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టి త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాటిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హేమంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కేశవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆదేశించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చేపట్టిన అభివృద్ధి పనులపై శుక్రవారం కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో గుర్తించిన బస్తీ దవాఖానాల్లో వసతులు కల్పించి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఒక అంగన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడీ కేంద్రాన్ని ఎంపిక చేసి మోడల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దాలని చెప్పారు. నర్సరీల్లో అన్ని రకాల మొక్కలను పెంచడంతో పాటు, హరితహారం టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చేరుకోవాలన్నారు. పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న వైకుంఠధామాల పనులను త్వరగా పూర్తి చేసి వసతులు కల్పించాలని ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీల్లోని మహిళా సంఘాలకు మెప్మా ద్వారా లోన్లు మంజూరు చేయాలని చెప్పారు. అనంతరం వెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వెజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్ల నిర్మాణ పనులపై చర్చించారు. సమావేశంలో మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్లు సత్యనారాయణరెడ్డి, మహేశ్వర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, వెంకటేశ్వర్లు, డి.శ్రీను, మెప్మా పీడీ రమేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు.

లాయర్ల రక్షణకు చట్టం చేయాలి

హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌/కోదాడ, వెలుగు : లాయర్లపై దాడు లను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం చేయాలని పలువురు డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఇల్లందులో లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సత్యనారాయణపై దాడి చేయడాన్ని నిరసిస్తూ శుక్ర వారం హుజూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, కోదాడలో లాయర్లు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ లాయర్ల రక్షణ కోసం చట్టం చేయాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. అనంతరం సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, జూనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జీలు శ్యాంకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సాకేత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మిత్రాలకు వినతిపత్రం అందజేశారు. లాయర్లు కాల్వ శ్రీనివాసరావు, చనగాని యాదగిరి, ప్రవీణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, అంజయ్య, రాఘవరావు, వెంకయ్య, కొట్టు సురేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాగార్జున, జక్కుల వీరయ్య పాల్గొన్నారు

ధరలు పెంచడం తప్ప.. బీజేపీ చేసిందేంటి ?

యాదాద్రి, వెలుగు : బీజేపీ అధికారంలోకి వచ్చాక ధరలు పెంచి పేదలను ఇబ్బంది పెట్టడం తప్ప, వారికి చేసిందేమీ లేదని టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం భువనగిరిలో మీడియాతో మాట్లాడారు. దేశ సంపదను బీజేపీ పూర్తిగా ప్రైవేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పరం చేస్తోందన్నారు. ఎక్కడ, ఏ ప్రభుత్వాన్ని కూల్చాలని ఆలోచించడం తప్ప ప్రజల కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. మునుగోడును ఏనాడూ పట్టించుకోని రాజగోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డిని ఆ నియోజకవర్గ ప్రజలు తిరస్కరిస్తున్నారన్నారు. మునుగోడులో టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ క్యాండిడేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఆయన వెంట సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు గోద శ్రీరాములు, జహంగీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉన్నారు.

ప్రభుత్వ కేంద్రాల్లోనే వడ్లు అమ్మాలి

తుంగతుర్తి, వెలుగు : ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నూతనకల్, మద్దిరాల, నాగారం మండలాల్లో ఏర్పాటు చేసిన ఐకేపీ, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వడ్ల కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు నాణ్యమైన వడ్లను తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని, దళారుల మాట నమ్మి మోసపోవొద్దని సూచించారు. ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఏ -గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వడ్లకు రూ.2,060లు, కామన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రేడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.2,040 మద్దతు ధర ఇస్తున్నట్లు చెప్పారు. అనంతరం తుంగతుర్తిలో ఇటీవల చనిపోయిన టీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యకర్తల ఫ్యామిలీలను పరామర్శించి ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రావు, డీఆర్డీవో పీడీ కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు. 

కల్లూరిని పరామర్శించిన లీడర్లు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం వెంకటాపురానికి చెందిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లీడర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కల్లూరి రాంచంద్రారెడ్డి కొడుకు శ్రీపతిరెడ్డి ఇటీవల యాక్సిడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో చనిపోయారు. విషయం తెలుసుకున్న పీసీసీ సభ్యుడు, కాంగ్రెస్ ఆలేరు నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి బీర్ల అయిలయ్య, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి, రాష్ట్ర నాయకురాలు బండ్రు శోభారాణి, తుర్కపల్లి ఎంపీపీ భూక్యా సుశీల రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శుక్రవారం గ్రామానికి వచ్చి రాంచంద్రారెడ్డిని పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీపతిరెడ్డి ఫొటో వద్ద నివాళి అర్పించారు. పరామర్శించిన వారిలో కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుడిపాటి మధుసూదన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రెడ్డి, యాదగిరిగుట్ట, ఆలేరు ఎంపీపీలు చీర శ్రీశైలం, గంధమల్ల అశోక్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షుడు కానుగు బాలరాజుగౌడ్, పట్టణ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఎంపీటీసీ కర్రె విజయ వీరయ్య ఉన్నారు.

చట్టాలపై అవగాహన ఉంటే  నేరాలు తగ్గుతాయి

దేవరకొండ, వెలుగు : చట్టాలపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని దేవరకొండ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించారు. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మర్రిచెట్టుతండాలో శుక్రవారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన మాట్లాడారు. క్షణికావేశంలో నేరాలు చేసి జీవితాన్ని పాడు చేసుకోవద్దన్నారు. చట్టాలపై అవగాహన కలిగి ఉంటే నేరాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కౌన్సిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సభ్యుడు నెమ్మికంటి రమాశంకర్, గౌరీశంకర్, సర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ శ్రీనునాయక్, ఎంపీటీసీ కొర్ర గౌతమి రాంసింగ్, ఉపసర్పంచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిన్నానాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.

పాఠాలు చెబుతున్నారా ? లేదా?

యాదాద్రి, వెలుగు : యాదాద్రి జిల్లా ఆలేరు ఎస్సీ కాలనీ ప్రైమరీ స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను శుక్రవారం అడిషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తివారి సందర్శించారు. ఈ సందర్భంగా 3 నుంచి ఐదో తరగతి చదువుతున్న స్టూడెంట్లతో ఆయన మాట్లాడారు. పాఠాలు చదవలేకపోవడం, రాయలేకపోవడం, చివరకు పదాలను సైతం గుర్తించలేకపోవడంతో ఆయన ఆశ్చర్య వ్యక్తం చేశారు. ఐదో తరగతి స్టూడెంట్లకు చదవడం, రాయడం రాకపోవడం ఏంటి? అసలు పాఠాలు చెబుతున్నారా ? లేదా అని టీచర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టూడెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభ్యసనా సామర్థ్యాలు పెంపొందేలా బోధించాలని హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎం సరోజ, టీచర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఆదేశించారు. అనంతరం అంగన్​వాడీ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సందర్శించారు. ఆయన వెంట డీఈవో కె.నారాయణరెడ్డి, ఎంపీడీవో జ్ఞానప్రకాశ్, మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మారుతీ ప్రసాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తదితరులు ఉన్నారు.    

అక్రమ కేసులు ఎత్తివేయాలి

మేళ్లచెరువు,వెలుగు: సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజాపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు ఉస్తేల సృజన డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శుక్రవారం నిర్వహించిన మీటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆమె మాట్లాడారు. ప్రజల కోసం పోరాడుతున్న రాజాపై కేంద్రం అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. వాటిని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో కోటమ్మ, కామేశ్వరమ్మ, మంగమ్మ, నీలమ్మ, రమణ, అరుణ, నాగమణి పాల్గొన్నారు.

హమాలీల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలి

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : హమాలీల సంక్షేమానికి సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్వామి డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. శుక్రవారం హమాలీలతో కలిసి సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సప్లై మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల్లో ప్రధాన పాత్ర పోషించే హమాలీల జీతాలను పెంచాలని కోరారు. ఐకేపీ, పీఏసీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల కమీషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి హమాలీలకు 2 జతల యూనిఫామ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వాలని, ప్రమాద ఇన్సూరెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెల్లించాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు దుర్గం జలంధర్, ఉయ్యాల స్వామిగౌడ్, పోతెపాక విజయ్, కోట సతీశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, దొంతం అంజయ్య పటేల్, కోట్ల శ్రీను, వంగూరి వెంకన్న, శ్రీను, కూతాటి వీరయ్య, కోనేటి ఈదయ్య, రామలింగయ్య, కల్మెర వెంకటస్వామి గౌడ్ పాల్గొన్నారు.

పేదలకు అండగా న్యాయసేవాధికార సంస్థ

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి కోర్టులకు రాని వారికి సైతం న్యాయసేవాధికార సంస్థ అండగా ఉంటుందని నల్గొండ సీనియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జడ్జి, డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ కార్యదర్శి బి.దీప్తి చెప్పారు. పేద, బలహీన వర్గాలకు ఉచిత న్యాయ సహాయం అందించడంపై శుక్రవారం పట్టణంలోని అరోరా లీగల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్టిట్యూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా బలహీనంగా ఉన్న వారికి న్యాయ సాయం చేయడంతో పాటు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు డీఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ కృషి చేస్తోందన్నారు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడొద్దని సూచించారు. ప్రతి గ్రామంలో అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో అరోరా లీగల్ సైన్స్ కాలేజీ ప్రిన్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నక్క యాదగిరి, డీఎల్ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఏ కోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కమిటీ సభ్యుడు జి. జవహర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి, లెక్చరర్లు యాదగిరి, శ్రీనివాస్, కాలేజీ నిర్వాహకులు సురిగి వెంకటేశ్వర్లుగౌడ్, స్టూడెంట్లు మహ్మద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సాదత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 
అలీ, రాచకొండ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలి

తుంగతుర్తి, వెలుగు : హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది గ్రామీణ ప్రజలకు అందుబాటులో ఉండాలని సూర్యాపేట డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో డాక్టర్ కోట చలం ఆదేశించారు. హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో శుక్రవారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామన్ రివ్యూ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా జాతీయ అరోగ్య సంస్థకు చెందిన టీం పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలు, పల్లె దవాఖానాల్లో తనిఖీ చేయనున్నట్లు చెప్పారు. ప్రజలకు అందుతున్న సేవల పూర్తి వివరాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. రివ్యూలో ప్రశాంత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బాబు, పద్మావతి, సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో బిచ్చునాయక్, సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వైజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రామచంద్రు, స్వరూపాకుమారి, సుభద్ర, తేజస్వి పాల్గొన్నారు.

ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతి స్కూల్‌ నుంచి ఒక టీచర్‌

నల్గొండ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆధ్వర్యంలో స్టూడెంట్ల కోసం కల్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిజైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ది కింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇన్నోవేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు నల్గొండ డీఈవో బొల్లారం భిక్షపతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 10వ తరగతి స్టూడెంట్ల కోసం నిర్వహించే ఈ ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనేందుకు ప్రతి స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నుంచి ఒక టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ఎంపిక చేయాలని ఆదేశించారు. స్టూడెంట్లతో ప్రాజెక్టులు రూపొందించే విధానంపై టీచర్లకు యూనిసెఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇంక్విలాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సంస్థలతో ఈ నెల 18న ట్రైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. 

చందుపట్ల వాసికి డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నకిరేకల్, వెలుగు : నల్గొండ జిల్లా నకిరేకల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం చందుపట్లకు చెందిన టంగుటూరి సైదులుకు ఉస్మానియా యూనివర్సిటీ డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించింది. ప్రొఫెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాశరథుల నర్సయ్య పర్యవేక్షణలో ‘నల్లగొండ జిల్లా అభ్యుదయ కవిత్వం- ఒక పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేయడంతో ఆయన డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఎంపికయ్యారు. సైదులు ప్రస్తుతం నాగార్జున ప్రభుత్వ కాలేజీలో గెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లెక్చరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పనిచేస్తున్నారు. సైదులుకు డాక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రకటించడం పట్ల ప్రొఫెసర్లు కాశీం, సాగి కమలాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌శర్మ, సూర్య ధనుంజయ, వారిజారాణి, ఎస్. రఘు, ఏలె విజయలక్ష్మి అభినందించారు.