
యాదగిరిగుట్ట, వెలుగు: శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను బుధవారం అధికారులు లెక్కించారు. ఎస్పీఎఫ్ భద్రత పర్యవేక్షణలో గుట్ట కింద సత్యనారాయణస్వామివ్రత మండపంలోని ప్రత్యేక హాల్ లో లెక్కింపు చేశారు. 41 రోజులకుగాను భక్తులు సమర్పించిన కానుకల్లో రూ.2,45,48,023 నగదు, 38 గ్రాముల బంగారం, 2 కిలోల 800 గ్రాముల వెండి వచ్చిందని ఈవో వెంకటరావు చెప్పారు. విదేశీ కరెన్సీని కూడా భక్తులు అధిక మొత్తంలో సమర్పించినట్టు చెప్పారు.
రూ. కోటికి పైగా అంజన్న ఆదాయం
కొండగట్టు: జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయంలో బుధవారం హుండీ లెక్కింపు చేపట్టారు. 53 రోజులకుగాను రూ. 1,10,03,402 నగదుతో పాటు విదేశీ కరెన్సీ వచ్చినట్లు ఈవో శ్రీకాంత్ రావు తెలిపారు. భక్తులు సమర్పించిన బంగారం, వెండిని తిరిగి హుండీలోనే భద్రపరిచారు. లెక్కింపులో ఎండోమెంట్ సూపరింటెండెంట్ రాజమౌళి, టెంపుల్ అధికారులు సునీల్, చంద్రశేఖర్, సిబ్బంది ఉన్నారు.