యాదగిరిగుట్టలో ఫుడ్ ఫెస్టివల్

యాదగిరిగుట్టలో ఫుడ్ ఫెస్టివల్

యాదగిరిగుట్ట, వెలుగు: వంద రోజుల ప్రణాళికలో భాగంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బుధవారం 'ఫుడ్ ఫెస్టివల్' కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళా సంఘాలు, మెప్మా  సిబ్బందితో పాటు, వీధి వ్యాపారులతో తినుబండరాల స్టాళ్లను ఏర్పాటు చేశారు. యాదాద్రి జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర రావు 'ఫుడ్ ఫెస్టివల్' కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వంటకాలను పరిశీలించి టేస్ట్ చేశారు. 

సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 7:30 గంటల వరకు నిర్వహించిన ఈ ఫెస్టివల్ లో అన్ని రకాల హోం ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ ప్రదర్శించారు.  మహిళా సంఘాలను బలోపేతం చేయడం కోసం.. సెల్ఫ్ హెల్ఫ్ గ్రూప్ ప్రొడక్ట్స్ ఫెస్టివల్ లో ప్రదర్శించామని అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.  ఫుడ్ తయారీ రంగంలో మహిళలను ప్రోత్సహించాలనే సంకల్పంతో.. ఈ ఫెస్టివల్ కార్యక్రమాన్ని చేపట్టిందని పేర్కొన్నారు.  కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లింగస్వామి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.