నర్సన్న హుండీ ఆదాయం రూ.1.84 కోట్లు

నర్సన్న హుండీ ఆదాయం రూ.1.84 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం ఆలయ సిబ్బంది లెక్కించారు.  ఎస్పీఎఫ్, హోంగార్డుల భద్రత నడుమ హుండీలను కొండ కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని ప్రత్యేక హాల్ కు  తరలించి,  ఆలయ ఈవో గీతారెడ్డి, చైర్మన్ నరసింహమూర్తి పర్యవేక్షణలో  కౌంటింగ్ చేపట్టారు. గత 20 రోజుల్లో  భక్తులు రూ.1,84,84,891 నగదు,  144 గ్రాముల బంగారం, 2 కిలోల 850 గ్రాముల వెండి, విదేశీ కరెన్సీని  నర్సన్నకు కానుకగా సమర్పించారని  ఈవో గీతారెడ్డి చెప్పారు.   అమెరికా,  యూఏఈ,  ఆస్ట్రేలియా,   ఇంగ్లాండ్,   కెనడా,   ఒమాన్,  సింగపూర్,    మెక్సికన్ కరెన్సీ హుండీల్లో వేశారు.   పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆలయానికి రూ.19,90,260 ఆదాయం సమకూరింది. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ సంతోష్ ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.