నారసింహుడి హుండీ ఆదాయం రూ. 2.59 కోట్లు

నారసింహుడి హుండీ ఆదాయం రూ. 2.59 కోట్లు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మంగళవారం ఆలయ అధికారులు హుండీలను లెక్కించారు. 33 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను ఎస్పీఎఫ్  భద్రత, ఆలయ ఈవో పర్యవేక్షణలో సత్యనారాయణస్వామి వ్రత మండపంలో లెక్కించగా, రూ. 2,59,03,628 ఆదాయం సమకూరింది. 32 గ్రాముల బంగారంతో పాటు 3 కిలోల 950 గ్రాముల వెండి సమకూరినట్లు ఆలయ ఈవో భవానీ శంకర్ తెలిపారు. విదేశీ కరెన్సీ సైతం వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.