నవంబర్​  2 నుంచి గుట్టలో కార్తీక పూజలు

నవంబర్​  2 నుంచి గుట్టలో కార్తీక పూజలు
  • నెల రోజుల పాటు ప్రతిరోజు ఆరు బ్యాచ్ లలో నిర్వహణ
  • ఒకేసారి 2 వేల జంటలు వ్రతాలు చేసుకునేలా ఏర్పాట్లు 
  • యాదగిరిగుట్ట ఆలయ ఈవో భాస్కర్ రావు  

యాదగిరిగుట్ట, వెలుగు :  కార్తీకమాసం పూజలకు యాదగిరిగుట్ట నరసింహుడి క్షేత్రం  ముస్తాబవుతోంది. నవంబర్ 2 నుంచి డిసెంబర్ 1 వరకు కార్తీకమాసం రోజుల్లో సత్యనారాయణస్వామి వ్రతాలు చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. అందుకనుగుణంగా ప్రతి రోజు 6 బ్యాచ్ ల్లో వ్రతాలు నిర్వహించుకునేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. మంగళవారం ఈవో ఆఫీస్ లో  ప్రెస్ మీట్ లో టెంపుల్ ఈవో భాస్కర్ రావు వివరాలు వెల్లడించారు.

గుట్ట కింద సత్యనారాయణస్వామి వ్రత మండపంలోని రెండు హాళ్లలో ఒక్కోదాంట్లో ఒకేసారి సుమారు 2 వేల జంటలు వ్రత పూజలు చేసుకునేలా  ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ఆయా రోజుల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి 2 గంటలకు ఒక బ్యాచ్ చొప్పున మొత్తం 6 బ్యాచ్ ల్లో వ్రతాలు నిర్వహించుకోవచ్చని పేర్కొన్నారు. పాతగుట్టలో కూడా రోజుకు 5 బ్యాచ్ ల్లో సత్యనారాయణస్వామి వ్రతాలు నిర్వహించనున్నా రు. ప్రతి రోజు5 బ్యాచులు వ్రతాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.  ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు  బ్యాచ్ ల సంఖ్యను పెంచినట్లు ఈవో తెలిపారు.