
యమహా 2025 ఎఫ్జెడ్ ఎక్స్ హైబ్రిడ్ బైక్ భారత మార్కెట్లో విడుదలైంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50 లక్షలు (ఢిల్లీ). ఇందులోని 149 సీసీ ఇంజిన్ 12.4 బీహెచ్పీని, 13.3 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. స్మార్ట్ మోటార్ జనరేటర్, స్టాప్ అండ్ స్టార్ట్ సిస్టమ్, 4.2-అంగుళాల కలర్ డిస్ప్లే, బ్లూటూత్ కనెక్టివిటీ, వైకనెక్ట్ యాప్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, సింగిల్-చానల్ ఏబీఎస్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.
ఈ బైక్ స్టాండర్డ్ (నాన్-హైబ్రిడ్) వెర్షన్ కూడా లభిస్తుంది. దీని ధర రూ. 1.30 లక్షలు. బండ్లను ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.