TOXIC: ‘A’ సర్టిఫికెట్‌తో వస్తున్న యష్.. సెన్సార్‌తో ‘టాక్సిక్’ అసలు స్టోరీ వైరల్

TOXIC: ‘A’ సర్టిఫికెట్‌తో వస్తున్న యష్.. సెన్సార్‌తో ‘టాక్సిక్’ అసలు స్టోరీ వైరల్

రాకింగ్ స్టార్ యశ్ (Yash) హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అంటెసిపేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘టాక్సిక్’ (TOXIC). ‘కేజీఎఫ్ 2’ వంటి గ్లోబల్ బ్లాక్‌బస్టర్ తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. పలుమార్లు వాయిదా పడిన తర్వాత, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆగస్ట్ 26న విడుదలకు సిద్ధమవుతోంది. నాలుగేళ్ల విరామం తర్వాత యష్ నటించిన ఈ చిత్రానికి తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. దీంతో పాటు సినిమా రన్‌టైమ్, స్టోరీ వివరాలు కూడా బయటకు వచ్చాయి.

భారీ రన్ టైమ్ & సెన్సార్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి 'A' సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ సినిమా రన్ టైమ్ ఏకంగా 3 గంటల 14 నిమిషాలు (194 నిమిషాలు) ఉండటం విశేషం. డార్క్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘టాక్సిక్’ మంచి ఛాయిస్‌గా ఉండనుంది. 

KGF తర్వాత యష్‌ను మరోసారి ఇంటెన్స్, మాస్ అవతార్‌లో చూడాలనుకునే అభిమానులతో పాటు, స్టైలిష్ విజువల్స్, పీరియడ్ బ్యాక్‌డ్రాప్, ఎమోషన్‌తో కూడిన యాక్షన్ కథలను ఆస్వాదించే వారికి ఈ సినిమా మరింత ఆకట్టుకునే అవకాశముంది.

అయితే చిత్రానికి ‘A’ సర్టిఫికెట్ లభించినందున, హింసాత్మక కంటెంట్ కారణంగా ఇది పెద్దల కోసం మాత్రమే. ముఖ్యంగా ఇందులో డార్క్, వైలెంట్ గ్యాంగ్‌స్టర్, రొమాన్స్ వంటి అంశాలు ఉండటం వల్ల ఈ సినిమాను 18 ఏళ్ళు పైబడిన వారే చూడాలి. 

గోవా బ్యాక్డ్రాప్లో జరిగే కథ..

సినిమా కథ స్వాతంత్ర్యం అనంతర గోవాలో సాగుతుంది. హింస, అసూయ రాజ్యమేలుతున్న ఆ కాలంలో ఓ గ్యాంగ్‌స్టర్ తన విధేయత, నైతిక విలువలు, ప్రేమ కోసం చేసే త్యాగం, వ్యక్తిగత విముక్తి కోసం చేసే పోరాటమే మెయిన్ కథ. చీకటితో నిండిన ప్రపంచంలో ప్రేమ, విముక్తి కోసం చెల్లించాల్సిన మూల్యాన్ని ఈ చిత్రం చూపించనుంది.

భారీ తారాగణం (Star Cast): ఈ చిత్రంలో యశ్ ద్విపాత్రాభినయం (Dual Role - Raya, Ticket) చేస్తుండగా, ఆయన సరసన బాలీవుడ్ మరియు సౌత్ స్టార్ హీరోయిన్లు నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ నటిస్తున్నారు. ఇంతమంది స్టార్ హీరోయిన్స్ కలిసి నటిస్తుండటంతో సినిమాపై క్యూరియాసిటీ విపరీతంగా పెరిగింది.