కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి : వీజీ గౌడ్​

కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి : వీజీ గౌడ్​
  • ఎల్లారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ఇన్​చార్జ్​ వీజీ గౌడ్

లింగంపేట,వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు 45 రోజుల సమయమే ఉందని బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి ఎమ్మెల్యే సురేందర్​ను మరోసారి గెలిపిచాలని బీఆర్ఎస్​ నియోజకవర్గ ఇన్​చార్జ్​ వీజీగౌడ్​ కోరారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎల్లారెడ్డిలోనే ఉంటానని ఆయన అన్నారు. లింగంపేట సమీపంలోని జీఎన్ఆర్​ గార్డెన్​లో సోమవారం నియోజకవర్గంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, బూత్ ​కమిటీల​ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఒక్కో బూత్​ కమిటీ అధ్యక్షుడు వంద మంది ఓటర్లను నిత్యం కలుస్తూ.. సీఎం కేసీఆర్​అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని సూచించారు.

వంద మందిలో కనీసం ఎనభై మంది బీఆర్ఎస్​కే ఓటేసేలా కష్టపడి పనిచేయాలన్నారు.  కేసీఆర్​ హయాంలోనే  తెలంగాణ అభివృద్ధి చెందిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, కార్యకర్తలు సమన్వయంతో పని చేస్తేనే విజయం వరిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఎల్లారెడ్డి గడ్డ బీఆర్ఎస్​ పార్టీకి అండగా నిలిచిందని, మరోసారి ఇక్కడ గులాబీ జెండా ఎగరాలన్నారు.

అనంతరం బీఆర్ఎస్​ అభ్యర్థి, సిట్టింగ్​ ఎమ్మెల్యే జాజాల సురేందర్​ మాట్లాడుతూ నియోజకవర్గంలో గడిచిన ఇరవై ఏండ్లలో జరగని అభివృద్ధి, అయిదేండ్లలోనే చేసి చూపించామన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశానన్నారు.